చిన్న ఝలక్ లాంటి ట్వీట్ తో తన తరువాతి సినిమా టైటిల్ ఏమిటన్నది చెప్పకనే చెప్పాడు అల్లు శిరీష్. అల్లు వారింట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన శిరీష్ ఈ సాయంత్రం ఓ ట్వీట్ చేసాడు. త్వరలో తనకు శ్రీమస్తు..శుభమస్తు..మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ. దాంతో అల్లు వారింట కూడా పెళ్లిబాజాలన్నమాట అనుకున్నారు చాలా మంది.
కానీ అది కాదట విషయం..పరుశురామ్ డైరక్షన్ లో త్వరలో చేయబోయే సినిమా పేరు..శ్రీరస్తు..శుభమస్తు అంటు. మన వాడు చిన్న బజ్ కమ్ క్యూరియాసిటీ క్రియేట్ చేద్దామని ఇలా ట్వీట్ చేసాడన్నామట. అయితే ఆ ఎగ్జయిట్ మెంట్ లో, శ్రీరస్తుకు బదులు శ్రీమస్తు అని తప్పు టైప్ చేసాడు. అదీ సంగతి. ఇంతకీ నిజమైన శ్రీరస్తు ఎప్పుడో?