చరణ్, ఎన్టీఆర్: సమంత ఎవరి సొంతం?

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా మొన్నటివరకు రాశి ఖన్నా పేరు వినిపించింది. ఇప్పుడు లిస్ట్ లోకి సమంత పేరు కూడా వచ్చి చేరింది. అన్నీ అనుకున్నట్టు…

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా మొన్నటివరకు రాశి ఖన్నా పేరు వినిపించింది. ఇప్పుడు లిస్ట్ లోకి సమంత పేరు కూడా వచ్చి చేరింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాజమౌళి సినిమాలో సమంతను కూడా హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తుందట సమంత. వీళ్లిద్దరూ ప్రస్తుతం రంగస్థలం సినిమా చేస్తున్నారు. రాజమౌళి సినిమాలో కూడా ఇదే జంట రిపీట్ కానుందట. నిజానికి ఇలా ఒకే హీరోయిన్ ను రిపీట్ చేయడం చరణ్ కు కొత్తకాదు.

గతంలో కాజల్ కు వరుసగా అవకాశాలిచ్చాడు. మొన్నటికిమొన్న రకుల్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు. ఇప్పుడు సమంతను కూడా రిపీట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం రాజమౌళికి సంబంధించిన ఓ యూనిట్ సమంతతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమాకు సమంత ఓకే చెబితే.. వరుసగా 2 నెలల పాటు కాల్షీట్లు కేటాయించాల్సి ఉంటుందట.

గతంలో రాజమౌళి డైరక్షన్ లో ఈగ సినిమాకు వర్క్ చేసిన అనుభవం సమంతకు ఉంది. కాబట్టి అతడి సినిమాకు ఎన్ని కాల్షీట్లు ఇవ్వాలి, వర్క్ స్టయిల్ ఎలా ఉంటుందనే విషయంపై సమంతకు క్లారిటీ ఉంది. 

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో చరణ్, ఎన్టీఆర్ పై ఒక రోజు టెస్ట్ కట్ కూడా జరిగింది. లేటెస్ట్ గా వినిపిస్తున్న అప్ డేట్స్ ప్రకారం.. ఆగస్ట్ లేదా అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ఉంటుంది.