సాయిధరమ్ తేజ లేటెస్ట్ సినిమాకు కరుణాకర్ దర్శకుడు. కెఎస్ రామారావు నిర్మాత. ఈ సినిమాకు కూడా ఓ పాట పల్లవినే టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
చిత్రంగా టాప్ హీరోల సాంగ్ కాకుండా ఎప్పుడో ఓ చిన్న హీరో చేసిన పాట నుంచి టైటిల్ ను తీసుకోవడం విశేషం. అయితే అలా అని ఆ పాటను తీసేయడానికి లేదు.
2001లో నాగేశ్వర రెడ్డి డైరక్టర్ గా చేసిన తొలి సినిమా 6 టీన్స్ లో సూపర్ హిట్ సాంగ్ అది. దేవుడు వరమందిస్తే.. అన్నపాట అది. ఘంటాడి కృష్ణ సంగీతం అందించిన పాట.
ఇప్పుడు అదే కరుణాకర్-సాయి ధరమ్ తేజ లవ్ జోనర్ సినిమాకు టైటిల్ అంట. జోనర్ కు తగినట్లు టైటిల్ బాగానే వుంది. పైగా క్యాచీగా కూడా వుంది. అదీ కాక సుప్రీమ్, తిక్క, ఇంటిలిజెంట్ లాంటి మాస్ టైటిళ్ల మాదిరిగా కాకుండా కాస్త ఫీల్ గుడ్ అనిపిస్తోంది. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీత దర్శకుడు.