‘సోలో బతుకు’ వెనుక ఇండస్ట్రీ

కరోనా కల్లోలం అనంతరం విడుదలవుతున్న తొలి సినిమా సోలో బతుకే సో బెటరు..ఈ సినిమా మీదే టాలీవుడ్ రేపటి ఆశలు వున్నాయి.  Advertisement థియేటర్లకు జనాలను ధైర్యంగా రప్పించగలిగితే తరువాత సినిమాల విడుదల సుగమం…

కరోనా కల్లోలం అనంతరం విడుదలవుతున్న తొలి సినిమా సోలో బతుకే సో బెటరు..ఈ సినిమా మీదే టాలీవుడ్ రేపటి ఆశలు వున్నాయి. 

థియేటర్లకు జనాలను ధైర్యంగా రప్పించగలిగితే తరువాత సినిమాల విడుదల సుగమం అవుతుంది. జనాలు రాకపోతే టాలీవుడ్ దిగాలు పడిపోతుంది. అందుకే సోలో బతుకు సినిమాకు అండగా నిలవాలని టాలీవుడ్ నిర్ణయించింది. 

పలువురు నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా తొలిరోజు, తొలి ఆటకు థియేటర్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందరూ ఒకే థియేటర్ కు కాకుండా వివిధ థియేటర్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా వుంటే సోలో బతుకు సొ బెటరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని, రాజమౌళి ఛీప్ గెస్ట్ అని ఓ గ్యాసిప్ సైట్ హడావుడి చేసింది. కానీ అలాంటిదేం లేదు. అసలు పంక్షనూ లేదు. రాజమౌళి రావడమూ లేదు. అది జస్ట్ గ్యాసిప్ మాత్రమే.

ప‌చ్చ మీడియా ప‌గ‌టి క‌ల‌లు