సెలబ్రిటీల పెళ్లి వ్యవహారాలన్నీ ఇప్పుడు ఓపెన్ సీక్రెట్స్ గా మారాయి. ఎవరూ ఖండించరు. అలా అని మేటర్ నిజమని ఒప్పుకోరు. మొన్నటికిమొన్న శ్రియ పెళ్లి ఎలా జరిగిందో చూశాం. అబ్బే అలాంటిదేం లేదంటూనే గప్ చుప్ గా పెళ్లి చేసుకుంది శ్రియ. ఇప్పుడు సోనమ్ కూడా ఇలానే సీక్రెట్ గా పెళ్లికి రెడీ అవుతోంది.
వచ్చే వారమే సోనమ్ పెళ్లి అంటూ బాలీవుడ్ లో ఓ రేంజ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త అహుజాతో ఈ ముద్దుగుమ్మ కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తోంది. వీళ్లిద్దరి ప్రేమాయణం గురించి బాలీవుడ్ లో అందరికీ తెలుసు. అతడ్నే ఆమె పెళ్లి చేసుకోబోతోందనే విషయం కూడా తెలుసు. కానీ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ లాంటి విషయాల్ని మాత్రం దాచేస్తున్నారు.
లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ముంబయిలోని సోనమ్ కపూర్ అత్తకు చెందిన ఓ భారీ భవంతిలో ఈ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో సంగీత్ వేడుక నిర్వహించబోతున్నారు. బాలీవుడ్ కు దూరంగా, ఎలాంటి స్టార్ ఎట్రాక్షన్ లేకుండా ఈ తతంగం మొత్తం పూర్తిచేస్తారట.
పెళ్లి తర్వాత సినీ, రాజకీయ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు పెద్ద పార్టీ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు సోనమ్ కపూర్ తండ్రి అనీల్ కపూర్. ఈ సీనియర్ నటుడికి టాలీవుడ్ తో కూడా మంచి సంబంధాలున్నాయి. సో.. రిసెప్షన్ కు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి.