రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూ సూద్. చేతికి ఎముకలేకుండా, ఎడాపెడా అడిగిన వారందరికీ సాయాలు చేస్తూపోతున్నాడు. అయితే ఇలా చేయాలంటే ఫండ్స్ కూడా వుండాలి కదా. అందుకే తన రెమ్యూనిరేషన్ ను కాస్త గట్టిగానే పెంచినట్లు తెలుస్తోంది.
తెలుగులో చాలా రోజులు గ్యాప్ తరువాత అల్లుడు అదుర్స్ సినిమా చేసాడు సోనూ సూద్. దానికి రెండున్నర కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆ తరువాత బోయపాటి-బాలయ్య సినిమా కోసం అడిగారని, దానికి సోనూ ఏడు కోట్లు రెమ్యూనిరేషన్ కోట్ చేసారని టాలీవుడ్ లో వినిపిస్తోంది. అయితే అంత రెమ్యూనిరేషన్ ఇవ్వలేమని, బోయపాటి టీమ్ వేరే ఆప్షన్ ను చూసుకున్నారని తెలుస్తోంది.
నిజానికి సోనూ సూద్ లాంటి వాళ్లకు కాస్త ఎక్కువ రెమ్యూనిరేషన్ ఇవ్వడం మంచిదే. ఎందుకంటే ఇలా తీసుకుని, అలా జనాలకు ఎలాగూ పంచేస్తారు కదా?