నాగశౌర్య సినిమా మరింత ఆలస్యం

నర్తనశాల ఫలితం కాస్త తేడా రావడంతో హీరో నాగశౌర్య తరువాత సినిమాల వ్యవహారంలో కాస్త గ్యాప్ వచ్చింది. ఛలో మాదిరిగా మళ్లీ పకడ్బందీ స్క్రిప్ట్ దొరికితేనే స్వంత బ్యానర్ పై సినిమా చేసే ఆలోచనలో…

నర్తనశాల ఫలితం కాస్త తేడా రావడంతో హీరో నాగశౌర్య తరువాత సినిమాల వ్యవహారంలో కాస్త గ్యాప్ వచ్చింది. ఛలో మాదిరిగా మళ్లీ పకడ్బందీ స్క్రిప్ట్ దొరికితేనే స్వంత బ్యానర్ పై సినిమా చేసే ఆలోచనలో వున్నారు. ఈ లోగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ మీద ఓ సినిమా స్టార్ట్ అయివుంది. నాలుగయిదు రోజులు షూట్ కూడా చేసారు. ఈషారెబ్బా కథానాయిక. ఈ సినిమా షూటింగ్ ఇదిగో, అదిగో అంటూ అలా వెనక్కు జరుగుతోంది.

స్క్రిప్ట్ రిపేర్ వర్క్ అదీ పూర్తి చేయడానికి కాస్త ఆలస్యం అయింది అనుకుంటే, హీరోయిన్ మార్చే ఆలోచన చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సంగతి అలా వున్నా, ఆ సినిమా నిర్మాత భవ్య ఆనంద్ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శేరిలింగంపల్లి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 

దాదాపు నెలకు పైగా ఇక అదే సందడి. అదీకాక కనీసం ముఫై నుంచి యాభైకోట్ల వ్యవహారం. దీంతో భవ్య వాళ్ల దృష్టి అటు మళ్లినట్లు తెలుస్తోంది. ఆ వ్యవహారం తరువాతే శౌర్య సినిమా సెట్ మీదకు వెళ్తుందని వినిపిస్తోంది.

ఇదిలా వుంటే సమంత హీరోయిన్ గా చేసే సినిమాకు శౌర్య ఇరవైరోజుల డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి