టీవీ చానెళ్ల సీట్లలో కత్తి మహేష్ కూర్చున్న కాలం చూసాం. ఇప్పుడు శ్రీరెడ్డి టైమ్ నడుస్తోంది. శ్రీరెడ్డి అంటే ఇప్పుడు యూట్యూబ్ లో, ఫేస్ బుక్ లో పిచ్చ క్రేజ్. ఆర్జీవీ లాంటి డైరక్టర్ నే ముంబాయికి పాకేసింది శ్రీరెడ్డి క్రేజ్ అని ట్వీట్ చేసాడు. సరే, శ్రీరెడ్డి సమస్య, ఆమె వేదన, తప్పు ఒప్పులు అన్నింటి సంగతి అలా వుంచితే, ఈరోజు ఉన్నట్లుండి వాట్సప్ లో ఓ కొత్త పోస్ట్ చలామణీ కావడం ప్రారంభమైంది.
అదేమింటే, శ్రీరెడ్డిగా చలామణీ అవుతున్న ఆమె అసలు పేరు శ్రీరెడ్డి కాదని, ఆ మాటకు వస్తే, ఆమె రెడ్డే కాదని, అసలు పేరు 'విమల చౌదరి' అని ఆ పోస్ట్ చెబుతోంది. దీంతో సోషల్ నెట్ వర్క్ లో కాస్త యాక్టివ్ గా వున్నవాళ్లు స్టన్ అయ్యారు. ఇన్నాళ్లు ఆమె రెడ్డి అనుకుంటున్నారు. కాదు చౌదరి అని ఇప్పుడు పోస్ట్ లు ప్రారంభమయ్యాయి. కానీ ఆమె మాత్రం తమది రెడ్డి ఫ్యామిలీ అనే అంటున్నారు.
దీంతో జనాలు మరి కొంత శోధించడం ప్రారంభించారు. దాంతో ఆమెకు ఒకపేరు కాదని, చాలా వున్నాయని తెలుస్తోంది. అయితే చౌదరి సామాజిక వర్గం అన్నది నిజమే అని, కానీ రెడ్డి అని పేరు ఎందుకు తగిలించుకున్నట్లో తెలియదని తెలుసున్న జనాలు అంటున్నారు. ఆమె గతంలో కొన్ని చానెళ్లలో యాంకర్ గా పని చేసిందని, ముఖ్యంగా సాక్షి ఛానెల్ లో కాస్త ఎక్కువ కాలమే కీలకమైన న్యూస్ ప్రెజెంటర్ గా వున్నదని తెలుస్తోంది.
మరో పక్క ఆమెది కృష్ణా జిల్లా అన్నది నిజమే అని, విమల అన్న పేరు కూడా నిజమే అని, అయితే విమలచౌదరి కాదు, విమలరెడ్డి అని కూడా వినిపిస్తోంది. ఇంటి పేరు మల్లిడి అని కూడా వినిపిస్తోంది. అందుకే కొన్నాళ్లు ఆమె విమల మల్లిడి అనే పేరుతో కూడా చలామణి అయినట్లు తెలుస్తోంది. సాక్షిలో చేరిన కొత్తలో శ్రీలేఖఅనే పేరు కూడా చలామణీలో వున్నట్లు తెలుస్తోంది.
ఓ ఇంటర్వూలో అయితే తమది రెడ్డి ఫ్యామిలీ అనే విమల చెప్పడం విశేషం. మరి అలాంటపుడు ఈ చౌదరి అన్న పేరు ఎలా ప్రచారంలోకి వచ్చిందో అన్నది తెలియదు. శ్రీరెడ్డికి ఫెళ్లయిందని ప్రచారం వుంది. బహుశా భర్త ద్వారా ఆ పేరు ఏమన్నా వచ్చిందేమో తెలియదు.
అయితే ఒక రోజు బయట వ్యక్తులతో ఏదో వివాదం వచ్చి, అది ఆఫీసు దాకా రావడంతో, ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఆమె చాలా మందికి చాలా పేర్ల ద్వారా పరిచయం అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆది నుంచీ కూడా సినిమా నటి కావాలన్నది ఆమె ఆశయమని, అందుకే ముందుగా ఛానెల్ యాంకర్ గా ప్రస్తానం ప్రారంభించిందని తెలుస్తోంది.
మొత్తానికి ఈరోజు శ్రీరెడ్డికి సంబంధించి రెండు విషయాలు బయటకు వచ్చినట్లు అయింది. ఒకటి ఆమెకు చాలా పేర్లు వున్నాయని, రెండవది ఆమె రెడ్డి సామాజిక వర్గం పేరు పెట్టుకున్నారు తప్ప, వాస్తవానికి ఆమె కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారని. ఈ విషయాలు ఆమె నిర్థారిస్తే తప్ప, అంత సులువుగా తెలియదు.
ఎవరిదా పెద్ద కుటుంబం
ఇదిలా వుంటే ఇండస్ట్రీని ఏలుతున్న పెద్ద కుటుంబానికి చెందిన వారు తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటా అని మోసం చేసారని శ్రీరెడ్డి తెలిపారు. ఆమె ఓ ఛానెల్ లో చెప్పిన విషయాలు ఇలా వున్నాయి.
''..టాలీవుడ్‌లో పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తి తనను మోసం చేశాడని, ప్రేమ పేరుతో శారీరకంగా వంచించాడని ఆమె తెలిపారు. అంతేకాదు పెళ్లి విషయానికి వచ్చే వరకూ తనతో అన్న మాటలను కూడా శ్రీరెడ్డి బయటకు చెప్పారు. ఓ ఛానెల్ నిర్వహించిన చర్చలో ఓ కాలర్ అడిగిన ప్రశ్నకు శ్రీరెడ్డి బదులిస్తూ ‘‘నన్ను మోసం చేసిన వ్యక్తి ఓ మాట అన్నాడు. నీ స్థాయి, కుటుంబం, జాతి, నువ్వేంటి..? మా తాత, తండ్రి ఏంటి…?. కొన్ని సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్నాము. నీ బతుకేంటో చూసుకో..?. మా కుటుంబం మీద కన్నేసి కొడలివై పోయి, మా ఆస్తి కొట్టేద్దామని చూస్తున్నావా..? వాడుకోవడం మా హక్కు. మేము సినిమాలకు నిర్మాతలుగా ఉన్నాము కాబట్టి మా దగ్గరికి చాలా మంది అమ్మాయిలు వస్తారు. మాకు వాడుకోవడం ఆచారం అన్నారు. దీంతో నేను రోడ్డుమీదకు వచ్చా. అతన్ని ఎదురించే వారు లేరు. ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న భావనలో ఉన్నారు. అందుకే నేను పోరాటం చేస్తున్నా….' ఇదె విషయం.
ఇప్పుడు జనాల దృష్టి ఆ కుటుంబం ఎవరిది అనే దానిపైకి మళ్లింది. ఇప్పటికే ఓ పెద్ద కుటుంబానికి చెందిన వారసుడిపై గుసగుసలు వున్నాయి. ఆ వారసుడితో ఈమె వున్న వీడియోలు, ఆమె దగ్గర వున్నాయని వినిపిస్తున్నాయి. దానిపై కొందరు మధ్యవర్తులు ఇటీవల రాజీ కూడా చేసారని వినిపిస్తోంది. కానీ మళ్లీ అంతలోనే ఆమె మనసు మార్చుకుని ఆ పేరును అన్యాపదేశంగా ప్రస్తావించడం విశేషం.
అణిచివేస్తారా?
ఇప్పటికే తనను అణచివేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని శ్రీరెడ్డి ఉరఫ్ విమల చౌదరి తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ పెట్టారు. తన ఇల్లు ఖాళీచేయమని ఇంటి యజమాని చెప్పారన్నారు. మీడియాను మేనేజ్ చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని కూడా ఆమె ఫేస్ బుక్ లో పెట్టారు. ఏమైనా శ్రీరెడ్డి ఉరఫ్ విమల చౌదరి విషయంలో ఇండస్ట్రీ పెద్ద తలకాయలన్నీ ఏకం అవుతున్నట్లే కనిపిస్తోంది. 'మా' సభ్యులంతా ఒంటి కాలి మీద లేచారు ఆమె మీద. అవకాశాలు ఇచ్చేవారిని కూడా వద్దని వారించారు. ఎవరైనా ఆమెతో నటిస్తే వెలివేస్తామన్నారు.
మరి శ్రీరెడ్డి ఉరఫ్ విమల రెడ్డి / చౌదరి ఆ విధంగానే ముందుకు వెళ్తారా? ఈ పోరాటంలో అలిసి ఆగిపోతారా? అన్నది చూడాలి. ఎందుకంటే వైవా హర్ష మీద పెట్టిన స్క్రీన్ షాట్ లు వగైరా ఇప్పుడు ఆమె ఫేస్ బుక్ పేజ్ లో కనిపించడం లేదు. మొత్తం మీద శ్రీరెడ్డి ఉదంతానికి ఫుల్ స్టాప్ పడితే, మరో సరైనది ఏదో ఒకటి దొరకాలి చానెళ్ల సందడికి.