శ్రీముఖి ఉందంటే చాలు సందడే సందడి. ప్రోగ్రాం పూర్తయ్యే వరకు మాటల సవ్వడి. అది బిగ్‌బాస్ కావచ్చు, సినిమా ఫ్రీ రిలీజ్ పంక్షన్ కావచ్చు. బుల్లి తెరపై యాంకర్‌గా మాటల ప్రవాహాన్ని అలవోకగా సృష్టిస్తూ తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి బిగ్‌బాస్-3 షో రన్నర్‌గా…ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
బుల్లితెరపై మెరిసే ఆ తార మనసును కొల్లగొట్టిన ఓ `బిగ్ లవర్` కూడా ఉన్నాడు. ఇదేమీ సోషల్ మీడియాలో ఆకతాయిలు పెట్టిన పోస్టింగ్ కాదండోయ్. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో మనసులో మాట పంచుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె ఎక్కడా దాచుకోకుండా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
`మీరు ప్రేమలో ఉన్నారా?` అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు శ్రీముఖి స్పందిస్తూ.. `అవును` అని సమాధానం ఇచ్చారు. అయితే అతని వివరాలు మాత్రం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. అలాగే `ఎవరైనా ముద్దుపెడతానంటే తిరస్కరించారా?` అని మరో వ్యక్తి అడిగిన ప్రశ్నకు `అవును.. ముద్దు వద్దని చెప్పాను` అంటూ ఆమె జవాబిచ్చారు.
అలాగే స్నేహితుడి నుంచి తప్పించుకునేందుకు కొన్నిసార్లు అబద్ధాలు చెప్పానని, పరీక్షల్లో చాలాసార్లు మోసం చేశానని కూడా శ్రీముఖి చెప్పుకొచ్చారు. అంతేకాదండోయ్ తన చెడు అలవాట్లను కూడా ఏ మాత్రం దాపరికం లేకుండా ఆమె చెప్పారు. అనుమతి లేకుండా పక్కవారి ఫోన్ చూడాల్సి వచ్చిందని, అది చాలా చెడ్డ అలవాటని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారామె.
తన ప్రేమ బ్రేకప్ అయిన విషయాన్ని బిగ్‌బాస్ షోలో ఆమె చెప్పిన విషయం తెలిసిందే. దాన్నుంచి బయటపడేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని కూడా ఆమె చెప్పారు. మళ్లీ ఇప్పుడు రెండోసారి ఆమె లవ్‌ట్రాక్‌లో ప్రయాణిస్తున్నారన్న మాట.