పెద్దిళ్లలో ఇలాంటి అలవాట్లు పెద్ద తప్పు కాకపోవచ్చు..కానీ అభిమానుల కోణం నుంచి చూస్తే ఇంత కన్నా దోషమూ, దారుణమూ లేదు. తమ అభిమాన హీరో, తాము ప్రాణంగా చూసుకునే హీరో భార్య బీభత్సంగా తాగుతుంది… తాగి ఊగుతుంది… ఈ మధ్యనే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడింది అంటే అభిమానులకు అంత కన్నా బాధ మరోటి ఉండదు, బహుశా అభిమానులు బాధపడతారు.. ఆ హీరో ఇబ్బంది పడతాడు అనే… పోలీసులు కూడా ఆమె పట్టుబడిన విషయాన్ని దాచి ఉంచారు. మీడియాకు ఎక్కించకుండానే వ్యవహారాన్ని కప్పి ఉంచారు!
స్టార్ హీరో భార్య అయిన ఆమెను యువతి అనే చెప్పాలి. ఇంకా చిన్న వయసులోని అమ్మాయే తను. బర్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ .. అంటూ ఆమె జన్మ వృత్తాంతాన్ని పరిచయం చేయవచ్చు. ఆ కుటుంబ నేపథ్యమే ఆమెను ఒక స్టార్ హీరోకి భార్యను చేసింది. ఆ విధంగా ఆమె తనకు సంబందం లేని ఒక రంగంలోకి అడుగు పెట్టింది. అంతకు ముందే అలవాటు ఉండేదో లేక.. భర్త తీరు వల్లనే అలవాటు అయ్యిందో కానీ.. తను విచ్చల విడిగా తాగేస్తోంది. తమ క్లాస్ వాళ్లు కలిసే పబ్బుల్లో… తనకు అత్యంత సన్నిహితులతో కలసి ఆమె మద్యంతో సేదతీరుతోంది. ఇటీవల ఆమె తాగి కారు డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడింది.
అయితే ఈ విషయాన్ని పోలీసులు మరీ ఎక్కువగా వెలుగులోకి రాకుండా కప్పిపెట్టారు. కానీ విషయాన్ని అయితే పూర్తిగా దాచలేకపోయారు. ఆమెకు కాకుండా ఆమె భర్త అయిన స్టార్ హీరోకి సమాచారం ఇచ్చి.. కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటి తీరు మీకే చెడ్డపేరును తెస్తుంది గుర్తుంచుకోండి.. అంటూ వారు గట్టిగా క్లాస్ పీకారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని హితబోధ చేశారు. మరి ఆ హీరో ఇప్పుడు భార్యను ఎంత వరకూ కంట్రోల్ లో పెడతాడో.. తన పరువును ఎంత వరకూ నిలుపుకుంటాడో చూడాలి!