నాగ్ అటు..అఖిల్ ఇటు?

అఖిల్ సినిమా రెడీ అవుతోంది. విడుదల కాస్తా వారంలోకి వచ్చేసింది. ఇది ఫాంటసీ సబ్జెక్ట్ సినిమా. కాస్త గ్రాఫిక్స్ వ్యవహారం అదీ వుంది. అయితే గ్రాఫిక్ సినిమాలు అన్నింటికీ వచ్చే సమస్యే అఖిల్ కు…

అఖిల్ సినిమా రెడీ అవుతోంది. విడుదల కాస్తా వారంలోకి వచ్చేసింది. ఇది ఫాంటసీ సబ్జెక్ట్ సినిమా. కాస్త గ్రాఫిక్స్ వ్యవహారం అదీ వుంది. అయితే గ్రాఫిక్ సినిమాలు అన్నింటికీ వచ్చే సమస్యే అఖిల్ కు కూడా వచ్చిందన్న వదంతి వినిపిస్తోంది. గ్రాఫిక్స్ అప్ టు ది మార్క్ రాలేదని.

నాగార్జున అవసరమైతే టైమ్ తీసుకోండి..బాగా వచ్చేలా చూడండి అంటున్నాడని వినికిడి. దర్శకుడు వివి వినాయక్ కూడా దానికే సై అంటున్నాడు. అయితే నిర్మాత నితిన్, హీరో అఖిల్ మాత్రం..అవసరం లేదు, ఇప్పుడే విడుదల చేసేద్దాం అంటున్నారని టాక్ వినిపిస్తోంది.

దసరా సీజన్ కు అని ముందే చెప్పి అమ్మేసాం కదా, లెక్కలు, కలెక్షన్లలో తేడా వస్తుంది..బయ్యర్లు ఇబ్బంది పడతారు అన్నది నితిన్ పాయింట్ ఆఫ్ వ్యూ గా తెలుస్తోంది.. ఫస్ట్ మూవీ ది బెస్ట్ గా వుండాలన్నది నాగ్ అయిడియా వుంది. పైగా నాగ్ కు ఈ పోటీలు, ఢీ కొట్టడాలు అలాంటివి పెద్దగా పట్టింపులు లేవు. సేఫ్ గా మన సినిమా మనం చేసుకోవాలి అనే టైపు. అలాంటపుడు..వన్ వీక్ వెనక్కు వెళ్లి, గ్రాఫిక్స్ పెర్ ఫెక్ట్ చేసుకున్నా తప్పులేదేమో?