Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'స్టార్స్' చూపిస్తున్న బాలయ్య?

'స్టార్స్' చూపిస్తున్న బాలయ్య?

హీరోల డేట్ లు సంపాదించడమే కాదు, హీరోలకు హీరోయిన్లను పట్టుకోవడం కూడా చాలా కష్టమే.అందునా బాలయ్య లాంటి సీనియర్ హీరోలకు హీరోయిన్లను వెదకడం అంటే అంత వీజీ కాదు. అందుకే బోయపాటి తన సినిమాకు కొత్త హీరోయిన్లను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. దీని వల్ల బడ్డెట్ కూడా తగ్గుతుంది. కానీ ఇప్పుడు కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఎలాగైనా ఒక్క హీరోయిన్ అయినా స్టార్ హీరోయిన్ కావాలని బాలయ్య అడుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. ఒకరిని కావాలంటే కొత్త వాళ్లని పెట్టుకో, ఒకరిని మాత్రం స్టార్ హీరోయిన్ లేదా పాపులర్ హీరోయిన్ వుండాలని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక్కడ సమస్య బడ్జెట్ మాత్రమే కాదు. అది మాత్రమే అయి వుంటే ఏదో విధంగా కిందా మీదా పడతారు. కానీ బాలయ్య ఫక్కన హీరోయిన్ అంటే ఎవ్వరూ అంత సులువుగా ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అదే అసలు సమస్య. మొత్తం మీద బోయపాటికి స్టార్ హీరోయిన్ కోసం 'స్టార్స్' కనిపిస్తున్నాయన్నమాట.

పేద‌ల‌కు మంచి జ‌ర‌గ‌డం చంద్ర‌బాబుకు ఇష్టం లేదా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?