కరోనా వైరస్ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ వేటాడుతోంది. ఏ మాత్రం అవకాశం వచ్చినా కరోనా దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో మనకు బాగా తెలిసిన రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కరోనా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. బీజేపీలో సీనియర్ నాయకుడైన ఆయన గెలుపోటములతో సంబంధం లేకుండా హైదరాబాద్‌లో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరు ఆయన సంపాదించుకున్నారు.
ప్రస్తుతం ఆయన కరోనాతో పోరాటం చేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. చింతలకు కరోనా పాజిటివ్ అని తేలిన నేపథ్యంలో వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో ఆయన భార్య, కుమారుడికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చింతల బంధువులు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు.
లాక్‌డౌన్ సమయంలో పేదలను ఆదుకునేందుకు చింతల రామచంద్రారెడ్డి చాలామందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని తెలుస్తోంది. దీంతో ఆయన నుంచి మరెవరికైనా కరోనా వ్యాప్తి చెంది ఉంటుందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.