సబ్జెక్ట్ ఓకె నిర్మాతను తెచ్చుకో

కమెడియన్ గా వుంటూ, హాయిగా సినిమాల మీద సినిమాలు చేసుకోకుండా, హీరో కావాలనుకుంటారు. అక్కడ సక్సెస్ అంటే అంత సులువు కాదు. హీరో డ్యాన్స్ లు చేస్తాడు. మనం డ్యాన్స్ లు చేయగలం, హీరో…

కమెడియన్ గా వుంటూ, హాయిగా సినిమాల మీద సినిమాలు చేసుకోకుండా, హీరో కావాలనుకుంటారు. అక్కడ సక్సెస్ అంటే అంత సులువు కాదు. హీరో డ్యాన్స్ లు చేస్తాడు. మనం డ్యాన్స్ లు చేయగలం, హీరో ఫైట్లు చేస్తాడు, మనం ఫైట్లు చేయగలం, హీరో సెంటిమెంట్ పండిస్తాడు. మనం పండిస్తాం. ఇంకేం కావాలి. ఇలా ఆలోచనలు సాగిస్తారు.

కానీ జనం, తమను కమెడియన్ గానే చూడ్డానికి ఇష్టపడుతున్నారన్న వ్యవహారాన్ని గమనించారు. ఇలా గమనించకుండా హీరోగా ప్రయత్నించి పెద్దగా ఫలితం సాధించలేదు ఓ కమెడియన్. అందుకే ఇంకా హీరో పాత్రల మీద ఆశపోవడం లేదు. ఇప్పుడు ఔత్సాహిక కథకులు, లేదా దర్శకులు కావాలనుకున్నవారు ఏ కథ తెచ్చినా, అలా అలా వినేసి, 'సూపర్.. నిర్మాతను తెచ్చుకో చేసేద్దాం' అంటున్నాడట.

ముందు నిర్మాత అంటూ వస్తే, తను మిగిలిన సంగతులు చూసేసుకోవచ్చు అన్న ధీమా అంట. ఇప్పటికే ఇటీవల ఈహీరోతో సినిమా తీసిన ఔత్సాహిక నిర్మాత చాలా నష్టపోయి, ఇంట్లో వాళ్ల సణుగుళ్లు ఎదుర్కొంటున్నట్లు వినికిడి.

ఈసంగతి తెలిసి ఏ నిర్మాత ముందుకు వస్తారు. అయినా మంచి కమెడియన్ అనిపించుకున్న వాళ్లందరికీ ఇదేం సరదానో? జనం తమను మెచ్చుకున్న లైన్ లో ముందుకు వెళ్లి కెరీర్ సూపర్ అనిపించుకోకుండా, హీరో అయిపోదామన్న తాపత్రయం ఎందుకో? ఈతత్వం అర్థం చేసుకున్న వెన్నెల కిషోర్ పొరపాటున కూడా హీరోగా చేయనని ఎప్పుడో చెప్పేసాడు.