మైత్రీమూవీస్-సుకుమార్ సినిమాను హడావుడిగా ప్రకటించారు హీరో అల్లుఅర్జున్. నిజానికి దానికి స్క్రిప్ట్ లేదు, లైనూ లేదు అని గుసగుసలు వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు తన ఆస్థాన దర్శకుడు శ్రీరామ్ వేణు అలియాస్ వేణు శ్రీరామ్ తో వచ్చి బౌండ్ స్క్రిప్ట్ చూపించేయడం, అది అద్భుతంగా నచ్చేసి బన్నీ ఓకె అనేయడం అయిపోయింది.
ఇప్పుడు ఈ సినిమాను ముందుగా పట్టాలు ఎక్కించాలని నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబుతో భారీ సినిమా మహర్షి అయిపోయింది. విడుదలకు రెడీ అవుతోంది. మళ్లీ మరో సినిమా మహేష్ తోనే జూన్ నుంచి ప్రారంభం కాబోతోంది. అది కూడా డిసెంబర్ నాటికి పూర్తయిపోతుంది. అందుకే ఆ టైమ్ కు బన్నీ సినిమాను స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఫ్రస్తుతం బన్నీ చేస్తున్న తివిక్రమ్ సినిమా పూర్తికాగానే తన సినిమాను దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ స్క్రిప్ట్ రెడీగా లేకపోవడం అన్నది ఇందుకు దారితీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆరునెలల్లో సుకుమార్ కథ తయారుచేయాలి, బన్నీని ఒప్పించాలి, అప్పుడు స్క్రిప్ట్ తయారుకావాలి.
నాలుగు అయిదు నెలలుగా దర్శకుడు త్రివిక్రమ్ ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ మాత్రమే తయారుచేయగలిగారు. సెకండాఫ్ లేకుండానే సెట్ మీదకు వెళ్తున్నారు. బన్నీ స్క్రిప్ట్ ఓకె చేయడం అంటే అంత టఫ్ గా వుంటుంది. మరి సుకుమార్ కు ఆరునెలల్లో స్క్రిప్ట్ అన్నది సాధ్యమేనా? అన్నది చూడాలి.