మన కథానాయకులు మార్కెట్ పెంచుకోవడంలో దృష్టి పెట్టారు. పక్క రాష్ట్రాల్లో పాగా వేయడానికి చూస్తున్నారు. సునీల్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టేశాడు. త్వరలో తమిళంలో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
తమిళ దర్శకుడు బాలాజీ శక్తివేల్ (ప్రేమిస్తే ఫేమ్)తో జత కట్టి ఓ సినిమా చేయబోతున్నాడు సునీల్. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారమ్. వినోదాత్మకంగా సాగే ఈ కథలో సున్నితమైన భావోద్వేగాలను మేళవించాడట శక్తివేల్.
ఇలాంటి కథ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ బాగా వర్కవుట్ అవుతుందని సునీల్ భావిస్తున్నాడు. ప్రస్తుతం ‘భీమవరం బుల్లోడు’ సినిమాలో నటిస్తున్నాడు సునీల్. త్వరలోనే ఈ తమిళ సినిమా గురించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.