తంతే బూరెల బుట్టలో పడ్డాడు ప్రభుదేవా. తెలుగునాట చిన్నా చితకా వేషాలేసుకొంటూ గడిపేవాడు. దర్శకుడిగా తొలి సినిమా ఘన విజయం సాధించినా ఆ క్రెడిట్ ఎమ్మెస్ రాజుకి పోయింది. రెండో సినిమాలో ఆఅవకాశం కూడా లేదు. పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ బోల్తా కొట్టడంతో దర్శకుడిగానూ సినిమాల్లేకపోయాయి.
సడన్‌గా ఏం బుద్ది పుట్టిందో ప్రభుదేవా బాలీవుడ్‌కి వెళ్లిపోయాడు. దక్షిణాది కథల్ని చాలా తెలివిగా రీమేక్ చేసుకొంటూ అక్కడ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు అక్కడ మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో ప్రభుదేవా పేరు కూడా ఉంటుంది. ఆయన పారితోషికం ఎంతో తెలుసా…? రూ. 15 కోట్లు. అంతేకాదు.. లాభాల్లో వాటా ఇవ్వాలట.
తెలుగులో సెకండ్ హీరో క్యారెక్టర్లు ఎన్ని వేస్తే మాత్రం ప్రభుదేవా రూ. 15 కోట్లు సంపాదిస్తాడు…? అందుకే అంటారు.. ఏదైనా రాసిపెట్టి వుండాలని.