మహేష్‌ మరో రికార్డు!

అందరి చూపూ ఇప్పుడు వన్‌ సినిమాపైనే ఉంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది..?  ఎన్ని సంచలనాలు సృష్టిస్తుంది??  అనే విషయాలపై అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకొంటున్నారు. వీరి ఆలోచనలకు…

అందరి చూపూ ఇప్పుడు వన్‌ సినిమాపైనే ఉంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది..?  ఎన్ని సంచలనాలు సృష్టిస్తుంది??  అనే విషయాలపై అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకొంటున్నారు. వీరి ఆలోచనలకు అనుగుణంగానే '1' సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదల కాకమునుపే బాక్సాఫీసును షేక్‌ చేస్తోంది. శాటిలైట్‌ హక్కుల్లో తన హవా చూపించిన మహేష్‌.. ఇప్పుడు మరో రికార్డు సృష్టించాడు. 

ఈ సినిమా కర్నాటక హక్కుల్ని అత్యధిక రేటుకు అమ్మేశారు. కర్నాటకలో తెలుగు సినిమాకి మంచి మార్కెట్‌ ఉంది. ఇక్కడి నుంచి వెళ్లే సినిమాల్ని భారీ మొత్తాన్ని వెచ్చించి కొంటుంటారు. వన్‌ సినిమా అక్కడ ఏకంగా రూ.4.5 కోట్లకు అమ్ముడుపోయిందట. తెలుగు సినిమాలకు సంబంధించి ఇదే రికార్డు. భవిష్యత్తులో మహేష్‌ సినిమా ఇంకెన్ని రికార్డులను సవరిస్తుందో చూడాలి.