సూర్యకు మంచి రేటు

మళ్లీ శాటిలైట్ మార్కెట్ మెల మెల్లగా పుంజుకుంటోంది. కాస్త బాగుంది అనుకుంటే చాలు సినిమాలకు మంచి రేటే పలుకుతోంది. లయన్. కిక్ 2 వంటి సినిమాలకు మంచి రేట్లు వచ్చాయి. చిన్న, మీడియం సినిమాలకు…

మళ్లీ శాటిలైట్ మార్కెట్ మెల మెల్లగా పుంజుకుంటోంది. కాస్త బాగుంది అనుకుంటే చాలు సినిమాలకు మంచి రేటే పలుకుతోంది. లయన్. కిక్ 2 వంటి సినిమాలకు మంచి రేట్లు వచ్చాయి. చిన్న, మీడియం సినిమాలకు కూడా ఇలాగే వుంది మార్కెట్. ఆ మధ్య విడుదలైన నిఖిల్ సూర్య వెర్సస్ సూర్య సినిమాకు మంచి రేటు వచ్చింది. 

మా టీవీ ఈ సినిమా శాటిలైట్ హక్కులు తీసుకుంది. సుమారు నాలుగు కోట్ల దాకా పలికినట్లు తెలుస్తోంది. సినిమా ఏవరేజ్ గా వుందని టాక్ వచ్చినా, విగరస్ గా పబ్లిసిటీ చేయడం కలిసి వచ్చింది. 

దాని వల్ల కలెక్షన్లు అయిదునుంచి ఆరు కోట్ల మధ్య వచ్చాయి. మొత్తం అన్నీ కలిపి నిర్మాతకు పది కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది, సినిమాను మీడియం బడ్జెట్ తో చేయడంతో మంచి లాభాలు వచ్చాయి. ఇప్పుడు మంచు మనోజ్ తో సినిమా ప్రారంభించేసారు నిర్మాత శివకుమార్.