పూరి జగన్నాధ్..ఇప్పుడు టాలీవుడ్ లో అందరికన్నా స్పీడ్ ఫిల్మ్ మేకర్. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఇటు మెగాస్టార్ చిరంజీవి, అటు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత అప్ కమింగ్ స్టార్ వరుణ్ తేజల సినిమాలు అతని చేతిలో వున్నాయి. ఇన్ని ఎప్పుడుచేసేస్తాడు అని ఆలోచించనక్కరలేదు. అతగాడు పూరి జగన్నాధ్..చేసేయగలడు.
మెగాస్టార్ చిరంజీవికి మూడు నెలల్లో సినిమా తీసి ఇస్తానని మాటిచ్చినట్లు తెలుస్తోంది. పూరి వ్యవహారం తెలిసిన వాళ్లకి ఇదేమీ వింత కాదు. కానీ మెగా క్యాంప్ వ్యవహారం తెలిసిన వారికి మాత్రం సాధ్యమేనా అన్నది అనుమానం. ఎందుకంటే ఇప్పుడు తన కొడుకు సినిమాల మీద చిరంజీవి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సీన్ సీన్ పట్టించుకుంటున్నారు. తను చాలదన్నట్లు తనకు నమ్మకం వున్న పరుచూరి బ్రదర్స్ ను లైన్లోకి తీసుకుంటున్నారు. ఇంకా తన తరం జనాల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారు.
మరి పూరి సినిమాకు కూడా చిరంజీవి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం రెండడుగులు ముందుకు, ఒక అడుగు వెనక్క అన్నట్లు వుంటుంది వ్యవహారం. అలాంటపుడు మూడు నెలల్లో పూర్తి చేయడం సాధ్యమవుతుందా పూరికి?