స్వామిరారా 2…?

నిఖిల్..సుధీర్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన స్వామిరారా సినిమా కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. మంచి విజయాన్ని నమోదు చేసింది. సుధీర్ వర్మ ఆ వెంటనే అక్కినేని క్యాంప్ కు షిప్ట్ అయిపోయాడు.…

నిఖిల్..సుధీర్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన స్వామిరారా సినిమా కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. మంచి విజయాన్ని నమోదు చేసింది. సుధీర్ వర్మ ఆ వెంటనే అక్కినేని క్యాంప్ కు షిప్ట్ అయిపోయాడు. చైతన్యతో భోగినేని ప్రసాద్ నిర్మించే సినిమాను దాదాపు పూర్తిచేసాడు. తన తరువాత సినిమా మీద కూడా ఓ ఐడియాతో రెడీగా వున్నాడని వినికిడి. 

చైతన్యతో సినిమా చేస్తూనే స్వామిరారా 2 స్క్రిప్ట్ రెడీ చేసేసుకున్నాడు. మళ్లీ నిఖిల్ తో ఆ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. చైతూ సినిమా పూర్తయి, విడుదలకు సిద్ధమైతే, ఈ ప్రాజెక్టు మీదకు వస్తాడని వినికిడి. నిఖిల్ కూడా చాలా మంది తనను అప్రోచ్ అవతున్నా,తనకు రెండు వరుస హిట్ లు ఇచ్చి, కెరీర్ ను మలుపు తిప్పిన సుధీర్ వర్మ, చందులకు ప్రయారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాడు.