తెలుగు హీరోయిన్లలో ఎవరూ ఎదుర్కోనంత స్థాయి కష్టాలను ఎదుర్కొంది శ్వేతబసు ప్రసాద్. 16 యేళ్ల వయసులో హీరోయిన్ గా తెలుగువాళ్లకు పరిచయం అయిన బెంగాలీ అమ్మాయి చాలా దారుణమైన పరిస్థితుల్లో వార్తల్లోకి వచ్చింది. వ్యభిచారం కేసులో పట్టుబడి… స్టేట్ హోంకు వెళ్లింది ఈ అమ్మాయి. తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు నటించిన అతి తక్కువమంది హీరోయిన్లు మాత్రమే ఈ విధమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాంటి వారిలో శ్వేత ఒకరు.
మరి అదంతా గతం.. శ్వేత స్టేట్ హోం నుంచి బయటకు వచ్చింది… అయితే టాలీవుడ్ మాత్రం పెద్దగా ఆదరించలేదు. ఆమె వ్యభిచారం కేసులో పట్టుబడకు ముందు చేసిన కొన్ని సినిమాల వారు మాత్రం.. ఆమె పేరుతో తమ సినిమాలను మార్కెట్ చేసుకోవడానికి ప్రయత్నించారు. వ్యభిచారం వివాదంలో ఇరుక్కొన్న శ్వేత పేరుతో.. ఆమె బొమ్మతో తమ సినిమాలను అమ్ముకోవడానికి వారు ప్రయత్నించారు. అలాంటి చీప్ ట్రిక్స్ తో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
ఇలాంటి నేపథ్యంలో శ్వేత ఇప్పుడు కొంత ఆశాభావ పరిస్థితుల్లో ఉంది. అందుకు కారణం ఒక బెంగాలీ సినిమా. ‘ఏక్ నదిర్ గొల్పో’ అనే ఒక సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా ఒక కాలంలోనే రూపొందింది. అందులో శ్వేత నటించింది. చాలా సంవత్సరాలుగా విడుదల ఆగిన ఆ సినిమా ఇప్పుడు విడుదల అవుతోంది. దీంతో తనకు మళ్లీ మంచి రోజులు వస్తాయని.. ఈ సినిమాతో బెంగాలీలోనైనా అవకాశాలు పెరుగుతాయని శ్వేత ఆశిస్తోంది. మరి శ్వేతా బసు కెరీర్ మళ్లీ ఎలా వెలుగొందుతుందో చూడాలి!