నూటయాభై సినిమాల అనుభవం. సినిమా జనాలను కాచి వడబోసిన మనిషి. మెగాస్టార్ చిరంజీవి. అలాంటి సీనియార్టీ వున్న ఆయన, ఇప్పుడు సైరా విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సైరా సినిమా పేపర్ వర్క్ అంతా పూర్తయింది. దానికోసం దర్శకుడు సురేందర్ రెడ్డికి చిరు పర్మనెంట్ స్క్రిప్ట్ టీమ్ జనాలు అంతా సహకరించారు. సినిమా సెట్ మీదకు వెళ్తుంటే సినిమాటోగ్రాఫర్ మారిపోయారు. మ్యూజిక్ డైరక్టర్ వదిలేసారు.
సరే ఓషెడ్యూలు అయితే చేసారు. కేమేరా ముందు, మోనిటర్ వెనకాల ఇలా మెగాస్టార్ డ్యూయల్ రోల్ చేసుకుంటూ వచ్చారని తెలుస్తోంది. కానీ ఈ షెడ్యూలు అయ్యాక, ప్రాజెక్టు సారథి సురేందర్ రెడ్డి పై మెగాస్టార్ చిరంజీవి కాస్త అసంతృప్తి చెందుతున్నారని వినిపించడం ప్రారంభమైంది. ఒక దశలో సీనియర్ డైరక్టర్ గుణశేఖర్ ను బ్యాక్ ఎండ్ లోకి తీసుకురావాలా అన్న ఐడియా కూడా చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంత భారీ ప్రాజెక్టుకు, అది కూడా కెమేరా మెన్, మ్యూజిక్ డైరక్టర్ మారిన తరువాత మళ్లీ మరో మార్పు ఏదన్నా చేయడం అంటే అంత మంచిది కాదని అనుకున్నారని టాక్ వినిపిస్తోంది. కానీ నిజానికి సురేందర్ రెడ్డి గట్టి డైరక్టర్ నే. కానీ మరి చిరుకు ఎందుకు అసంతృప్తి కలుగుతోంది. ఇది నిజమేనా, లేదా ఇండస్ట్రీలో ఈ వార్తలు ఎలా ఎందుకు పుట్టినట్లు అన్నది తెలియాల్సి వుంది.