టబు కోసం నాలుగు కోట్ల ఇల్లు

దర్శకుడు త్రివిక్రమ్ సినిమాల్లో ఇళ్లు, వాకిళ్లు అన్నీ ఓ రేంజ్ లో వుంటాయి. అది మిడిల్ క్లాస్ ఇల్లు అయినా, రిచ్ హవుస్ అయినా. అత్తారింటికి దారేది, అ ఆ సినిమాల్లో ఇది క్లియర్…

దర్శకుడు త్రివిక్రమ్ సినిమాల్లో ఇళ్లు, వాకిళ్లు అన్నీ ఓ రేంజ్ లో వుంటాయి. అది మిడిల్ క్లాస్ ఇల్లు అయినా, రిచ్ హవుస్ అయినా. అత్తారింటికి దారేది, అ ఆ సినిమాల్లో ఇది క్లియర్ గా కనిపిస్తుంది. లేటెస్ట్ గా త్రివిక్రమ్ హీరో బన్నీతో తీస్తున్న సినిమాలో రెండు ఇళ్లకు కలిపి అయిదు కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట.

వీటిలో టబు పాత్ర వుండే ఇల్లు కోసం నాలుగు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఇంటి ఇన్ సైడ్ సెట్ ను అన్నపూర్ణ స్టూడియోలో వేస్తున్నారు.  ఇంటి బయటి భాగం మాత్రం విదేశాల్లో ఓ రిచ్ హవుస్ చూసి, చిత్రీకరించి మిక్స్ చేస్తారట.

ఇదిలావుంటే ఇదే సినిమాలో హీరో బన్నీ కోసం ఓ ఇల్లు సెట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసారు. ఈ చిన్న ఇంటికి కోటి రూపాయలకు ఫైగా ఖర్చు చేసారు. ఈ ఇంట్లో వుండే యాంటిక్ ఫర్నిచర్ కే పాతిక లక్షలకు పైగా ఖర్చు అయింది. అలాగే ఇదే ఇంట్లో వుండే దేవుళ్ల తంజావూర్ ఫోటోలకే అయిదు లక్షల వరకు ఖర్చుచేసారట.

త్రివిక్రమ్ అభిరుచి మేరకు ఆర్ట్ డైరక్టర్ ఈ ఇంటి సెట్ ను తీర్చి దిద్దినట్లు తెలుస్తోంది. అలాగే టబు ఇంటి ఇన్ సైడ్ సెట్ ను అత్యంత విలాసవంతంగా తీర్చి దిద్దుతున్నట్లు తెలుస్తోంది.