అమ్మ అనిపించుకోవడం ఏ మహిళకైనా వరం అందుకేనేమో ప్రత్యేకమైన లక్ష్యాలేవైనా ఉంటే తప్ప పెళ్లి అయిన దగ్గర్నుంచి ఆ పిలుపు కోసం ఆశగా వేచి చూస్తుంటారు. అయితే ఈ విషయంలో హీరోయిన్లను మినహాయించాల్సిందేనేమో.. ‘‘తల్లి కావాలి అని నాకు ఉంది. అయితే ఇప్పుడప్పుడే కాదు. రెండా మూడా అని ఖచ్చితంగా చెప్పలేను కాని.,.. కొన్ని సంవత్సరాల తర్వాతే’’అంటోంది బాలీవుడ్ మిడిల్ ఏజ్డ్ బ్యూటీ కరీనా కపూర్.
పెళ్లి చేసేసుకున్నావ్. లక్షణంగా కాపురం చేస్తున్నావ్… పిల్లల విషయంలో ఎందుకీ ఆలస్యం? అని సన్నిహితులు అడిగే ప్రశ్నలకు కరీనా సమాధానం ఇది. ఇప్పటికే 35కి చేరుకున్న కరీనా… ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 16 ఏళ్లవుతోంది. హీరో సైఫ్ అలీఖాన్‌తో ఐదేళ్ల డేటింగ్ తర్వాత మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న బెబో… పెళ్లి చేసుకున్నా ఇండస్ట్రీలో ఇంకా హీరోయిన్గా కంటిన్యూ అయ్యే విషయంలో, అటు ఫ్యామిలీ, ఇటు కెరీర్‌ని బ్యాలెన్స్ చేసుకునే విషయంలో తను యంగ్ జనరేషన్‌కి స్ఫూర్తిగా నిలవాలని అనుకుంటున్నట్టు చెబుతోంది.
నెంబర్ల విషయంలో తనకు పట్టింపు లేదని, టాప్ స్టార్స్, టాప్ బేనర్స్ అందరితో నటించి, ఇప్పటికీ చేతినిండా సినిమాలున్న తను తన పొజిషన్ గురించి ఎప్పుడూ అభధ్రతకు గురవలేదంది. ‘‘సినిమా ఆఫర్ల గురించి భయపడి, సైఫ్ సిద్ధంగా ఉన్నా… పెళ్లి చేసుకోవడానికే మీనమేషాలు లెక్కించింది. ఇప్పుడు పిల్లలు వద్దనుకుంటోంది కూడా అందుకే… మరి ఈమెకు ఇన్సెక్యూరిటీ లేదంటే ఎవరు నమ్ముతారు?’’ అంటూ కరీనా అంటే గిట్టని కొందరు హీరోయిన్లు లాజిక్ తీస్తున్నారు.