గత రెండేళ్లలో చెప్పుకోతగ్గ విజయాలు లేని తమన్నాకి ఈ ఏడాదిలో కూడా నిరాశే మిగిలింది. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఆగడు’ డిజాస్టర్ అవడంతో తమన్నాకి ఐరెన్‌లెగ్ అనే బ్రాండ్ పడిపోయింది. మహేష్‌తో భారీ హిట్ ఇచ్చేసి క్రిటిక్స్ నోళ్లు పర్మినెంట్‌గా మూయించేద్దామనుకున్న తమన్నాకి మొత్తం రివర్స్ అయింది.
హిందీలో తమన్నా చేసిన హమ్‌షకల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఆమెకి మానని గాయాలు చేసాయి. హిమ్మత్‌వాలాతో అక్కడ జరిగిన పరాభవాన్ని మర్చిపోకముందే… ఈ ఏడాది తనకి దెబ్బ మీద దెబ్బ తగిలింది. హమ్ షకల్స్ అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన అతి బేకార్ సినిమాగా పేరు తెచ్చుకుంది. తమిళంలో అజిత్‌తో నటించిన ‘వీరమ్’ ఒక్కటే తమన్నాకి ఊరటనిచ్చింది.
ఆమెకి తమిళ చిత్ర పరిశ్రమే బాగా కలిసొచ్చిందనేది ఈ చిత్రం మళ్లీ రుజువు చేసింది. త్వరలో తమిళంలో ఆర్యతో ఓ చిత్రంలో కనిపించబోతున్న తమన్నా తెలుగులో చివరి హోప్‌గా ‘బాహుబలి’ మీద నమ్మకం పెట్టుకుంది. రాజమౌళి ఇంతవరకు ఫ్లాప్ ఇవ్వలేదు కాబట్టి తమన్నా అతడే తన రాత మార్చేస్తాడని ఫిక్సయిపోయింది.