Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తమ్ముడి కోసం వస్తున్న అన్న

తమ్ముడి కోసం వస్తున్న అన్న

సినిమా రంగంలో ఓ హీరో కోసం మరో హీరో రావడం ఇటీవల మామూలైపోయింది. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ఫంక్షన్ కే ఎవరో ఒక హీరోను తీసుకువస్తున్నారు. అలాంటిది కొత్త హీరో ఆనంద్ దేవరకొండ కోసం యంగ్ సూపర్ స్టార్ విజయ్ దేవరకోండ రావడంలో ఆశ్చర్యం ఏముంది. పైగా స్వంత తమ్ముడు కూడా.

మధుర శ్రీధర్, యాష్ రంగినేని కలిసి నిర్మిస్తున్న దొరసాని సినిమా ఈనెల 12న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ రేపు ఏర్పాటు చేసారు. ఈ సినిమాలో విజయ్ సొదరుడు ఆనంద్ దేవరకొండ హీరో. అయితే ఈ సినిమా గురించి ఇప్పటి వరకు విజయ్ పెదవి విప్పలేదు. టీజర్, వగైరాల గురించి స్పందించలేదు.

ఒకేసారి వేదిక మీద మాట్లాడాలని అనుకోవడం వల్లనే సైలెంట్ గా వున్నాడని తెలుస్తోంది. అందుకే రేపు జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్ కు విజయ్ హాజరవుతున్నాడు. ఒకే వేదిక మీద దేవరకొండ సోదరులు సందడి చేయబోతున్నారన్నమాట.

ముద్దు ముద్దు మాటలతో దొరసాని.. ఏమి చెప్పిందంటే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?