Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సావిత్రి అక్క... కేరాఫ్ బిగ్ బాస్?

సావిత్రి అక్క... కేరాఫ్ బిగ్ బాస్?

సావిత్రిగా పాపులర్ అయిన వి6 యాంకర్ జ్యోతి, ఆ చానెల్ నుంచి తప్పుకున్నారు. ఆమె ఇక కొన్నాళ్ల పాటు తెరమీద కనిపించరు. బిగ్ బాస్ 3 షోలో ఓ సభ్యురాలిగా వుండబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు మూడు నెలలు సెలవు తీసుకోవచ్చు. కానీ చిరకాలంగా వి6 ఛానెల్ లో పని చేస్తున్నందున ఇక వేరే అవకాశాలు వెదుక్కోవాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా వున్నట్లు వి6 వర్గాల బోగట్టా.

అందుకే ఆమె వి6కు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 21 నుంచి బిగ్ బాస్ 3 సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ షో మూడునెలల పాటు వుంటుంది. సావిత్రి అలియాస్ జ్యోతి ఈ షో ముగిసిన తరువాత కొత్త ఛానెల్ లోకి వెళ్లడమో, లేదా ప్రీలాన్సర్ గా, నటిగా అవకాశాలు వెదక్కోవడమో చేస్తారని తెలుస్తోంది.

ఇప్పటికే సావిత్రితో పాటు షో చేస్తున్న బిత్తిరి సత్తి సినిమాల్లో చురుగ్గానే చేస్తున్నారు. అదేబాటలో సావిత్రి అలియాస్ జ్యోతి కూడా వెళ్లబోతున్నట్లు కనిపిస్తోంది.

ముద్దు ముద్దు మాటలతో దొరసాని.. ఏమి చెప్పిందంటే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?