Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోయిన్.. సహజీవనం చేస్తోందా!

హీరోయిన్.. సహజీవనం చేస్తోందా!

'పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి..' అంటోంది తాప్సీ. అంటే  పెళ్లి ప్రస్తావన ఇప్పుడప్పుడే తన వద్ద తేవద్దని కాదు. ఆల్రెడీ తను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టుగా.. అయితే పెళ్లి మాత్రం ఇప్పుడే కాదన్నట్టుగా తాప్సీ చెబుతోంది. తన చెల్లెలు ద్వారా తనకు ఆ వ్యక్తి పరిచయం అయ్యాడని తాప్సీ చెబుతోంది. అయితే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశంత తనకు లేదని ముప్పై రెండేళ్ల ఈ నటి ప్రకటించింది.

గతంలో తాప్సీ విషయంలో పలు పుకార్లు వినిపించాయి. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో పని చేస్తున్నప్పుడు కొందరు నటులతో ఈమె పేరు మడిపడి ప్రచారం జరిగింది. ఒక తెలుగు హీరోతో, మరో తమిళ హీరోతో తాప్సీ ప్రేమ అంటూ వివిధ సందర్భాల్లో ఊహాగానాలు వినిపించాయి. 

ఒకదశలో చెన్నైలో వారిద్దరూ కొట్టుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. తాప్సీ విషయంలో వారి మధ్య గొడవ జరిగినట్టుగా ప్రచారం జరిగింది. అది కూడా ఒక పబ్ లో వారి మధ్యన గొడవ జరడంతో అది పెద్దది అయ్యింది కూడా. ఆ తర్వాత తాప్సీ ఆ క్యాంపులకు పూర్తిగా దూరం అయ్యింది. బాలీవుడ్ లో బిజీ అయ్యింది. అక్కడ ఈమెకు హిట్స్ దక్కాయి. 

సౌత్ లో కొంతమంది తన కెరీర్ ను నాశనం చేశారు తప్ప ఆ సినిమాలు ఉపయోగపడలేదని వాపోయింది. ఇప్పుడు లేడీ ఒరియెంటెడ్ సినిమాలతో ఆమె బిజీగా ఉంది. అవి కూడా హిట్ అవుతూ ఉండటంతో తాప్సీ కెరీర్ మంచి స్థాయిలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో డేటింగ్ విషయాన్ని ప్రకటించింది. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి అని అంత వరకూ అతడితో హ్యాపీగా అని తాప్సీ నిస్సంకోచంగా ప్రకటించింది.

నీ సినిమా గురించి అడిగి కడిగి పారేస్తా.. హీరో

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?