Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

రవితేజ లిస్ట్ లో కూడా పూరి లేరా?

రవితేజ లిస్ట్ లో కూడా పూరి లేరా?

రవితేజ..బెంగాల్ టైగర్ తరువాత ఇప్పటి దాకా ఖాళీగా వున్నారు. సరైన డైరక్టర్, సరైన ప్రాజెక్టు, సరైన నిర్మాత సెట్ కావడం లేదు. ఇక రవితేజను హీరోగా మార్చిన దర్శకుడు పూరి జగన్నాధ్ ది కూడా దాదాపు అదే పరిస్థితి.  అందువల్ల నీకు నేను..నాకు నువ్వు అన్నట్లు ఇద్దరు కలిసి సినిమా చేస్తారు అన్న వార్తలు వినవచ్చాయి. అయితే, అసలు రవితేజ డైరక్టర్ల జాబితాలో పూరి పేరు ఇప్పట్లో లేదని తెలుస్తోంది. 

ఇప్పటికే డైరక్టర్ బాబి సబ్జెక్ట్ ఓకె చేసాడు. నిర్మాత దొరకాలి. ఇదిలా వుంటే డైరక్టర్ చందు మొండేటికి కూడా రవితేజ కబురు చేసినట్లు తెలుస్తోంది. ఆయన కూడా ఓ లైన్ చెప్పారట. అది కూడా రవితేజకు పిచ్చ పిచ్చగా నచ్చేసిందట. పైగా ఎప్పుడో షాడో సినిమా చేసాడు థ్రిల్లర్ జోనర్ లో రవితేజ. ఇప్పుడు చందు చెప్పింది థ్రిల్లర్ జోనర్ అని తెలుస్తోంది. 

కానీ చందు ఇంకా ఎవరితో సినిమా చేయాలన్నది ఇంకా డిసైడ్ కాలేదు. నాగార్జున, ఎన్టీఆర్ ఇద్దరు కూడా రెండు లైన్లు వినివున్నారు. పైగా చందు కాస్త టైమ్ తీసుకుని, పక్కగా స్క్రిప్ట్ చేసుకునే ఎవరితోనైనా సినిమా చేస్తా అంటున్నాడు. ఆ టైమ్ గ్యాప్ ఎవరు ఇస్తారో మరి?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?