Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టాక్సీవాలాకు కలిసి వచ్చే లెగ్

టాక్సీవాలాకు కలిసి వచ్చే లెగ్

సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్లు. కొందరు నటులు గెస్ట్ రోల్ లో కనిపించినా సినిమాలు చీదేస్తాయన్న భయం వుంటుంది. మరికొందరు అలా కనిపిస్తే చాలు సినిమా హిట్ అన్న నమ్మకం వుంటుంది. టాక్సీవాలాకు అలాంటి కలిసి వచ్చే లెగ్ ఒకటి వుంది. మాళవిక నాయర్.

మాళవిక నాయర్ టాక్సీవాలాలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. కథ మొత్తం ఆమె చుట్టూనే రివాల్వ్ అవుతుంది. ఇప్పటి వరకు మాళవిక చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం, కళ్యాణ వైభోగమే, మహానటి, అన్నీ మంచి సినిమాలే. బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ కాని సినిమాలే. టాక్సీవాలా ఆ జాబితాలో చేరిపోతే, మాళవిక సినిమాకు గోల్డెన్ లెగ్ అని డిసైడ్ అయిపోతుంది ఇండస్ట్రీ.

వాస్తవానికి టాక్సీవాలాలో ఇద్దరు హీరోయిన్లు వున్నారు. రెండో హీరోయిన్, జస్ట్ గ్లామర్ యాడింగ్ మాత్రమే. కానీ మాళవికకు కాస్త కీ రోల్ వుంది. ఇంకోగమ్మత్తు ఏమిటంటే, విజయ్ దేవరకొండతో కలిసి ఎవడే సుబ్రహ్మణ్యంలో చలాకీ అల్లరి చేసింది మాళవిక. అయితే అతని సరసన హీరోయిన్ కాదు. అలాగే ఈ సినిమాలో కూడా మాళవిక డైరక్ట్ గా విజయ్ సరసన హీరోయిన్ కాకపోవడం విశేషం.

యువి, గీతా 2 కలిసి నిర్మించే ఈ సినిమాకు ఎస్ కెఎన్ నిర్మాత.

సినిమా రివ్యూ: సవ్యసాచి

చిలక.. 'ఛీ'బీఐ.. భళా మోడీ భళా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ లో 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?