మళ్లీ పట్టాలపైకి తేజ-వెంకీ సినిమా?

ఆగిపోయిందనుకున్న సినిమాలో మళ్లీ చలనం వచ్చింది. వెంకీ ప్రాజెక్టు నుంచి తేజ్ సైడ్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు తనకు ఏమాత్రం సంబంధం లేదంటూ వెంకీ స్వయంగా ప్రకటించాడు. అలా అగిపోయిందనుకున్న…

ఆగిపోయిందనుకున్న సినిమాలో మళ్లీ చలనం వచ్చింది. వెంకీ ప్రాజెక్టు నుంచి తేజ్ సైడ్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు తనకు ఏమాత్రం సంబంధం లేదంటూ వెంకీ స్వయంగా ప్రకటించాడు. అలా అగిపోయిందనుకున్న సినిమాలో మళ్లీ కదలిక వస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వెంకీ-తేజ సినిమా పట్టాలపైకి వచ్చే ఛాన్స్ ఉంది.

రీసెంట్ గా ఎన్టీఆర్ బయోపిక్ నుంచి కూడా తప్పుకున్నాడు తేజ. బాలయ్య చెప్పిన మార్పులు చేయడానికి నిరాకరించిన తేజ, ఆ సినిమా నుంచి స్వచ్ఛంధంగా తప్పుకున్నాడు. దీంతో వెంకీ ప్రాజెక్టుపై మరోసారి దృష్టిపెట్టాలని తేజకు నిర్మాత సురేష్ బాబు నుంచి పిలుపువచ్చింది.

ప్రస్తుతం రామానాయుడు స్టుడియోస్ లో ఆగిపోయిన ఈ ప్రాజెక్టుపై మళ్లీ కథాచర్చలు షురూ అయ్యాయి. రేపోమాపో ఫైనల్ డ్రాఫ్టింగ్ రెడీ అయిపోతుంది. జూన్ నుంచి సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో వెంకీ ప్రమేయం ఏమీ లేనట్టు కనిపిస్తోంది. సురేష్ బాబు చెబితే సెట్స్ పైకి వస్తాడు, వద్దంటే లేదు.

శ్రీరెడ్డి వ్యవహారంతో పాటు ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల సురేష్ బాబు, తేజ మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగినట్టు చెబుతున్నారు ఇండస్ట్రీ జనాలు. ప్రస్తుతం తన ఆంతరంగిక సభ్యుల్లో ఒకరిగా తేజను సురేష్ బాబు పరిగణిస్తున్నారు. ఆగిపోయిందనుకున్న సినిమా మళ్లీ పట్టాలపైకి రావడానికి ఇదే కారణమని తెలుస్తోంది.