Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తెలుగు సినిమా తేలిగ్గా తీసుకోరాదు

తెలుగు సినిమా తేలిగ్గా తీసుకోరాదు

సెన్సార్‌ బోర్డు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా రిలీజ్‌కి క్లియరెన్స్‌ ఇచ్చిన చిత్రానికి సెక్యూరిటీ సమస్యలకి భయపడి కొన్ని ప్రాంతాల్లోని అధికారులు తమంతట తాముగా ప్రదర్శనని నిషేధించడం ఏమిటి? వాల్మీకి విడుదలకి ముందురోజు రాయలసీమలోని రెండు జిల్లాలో హైడ్రామా జరిగింది. ఈ టైటిల్‌పై అభ్యంతరం తెలుపుతూ బోయ, వాల్మీకి సంఘాలు కలక్టర్‌ని ఆశ్రయిస్తే థియేటర్ల వద్ద అల్లర్లు జరిగే అవకాశం వుందంటూ చిత్ర ప్రదర్శనని నిషేధించాలని నిర్ణయించారు.

బయ్యర్ల శ్రేయస్సుని ఆలోచించి, అందులోను విడుదలకి ముందురోజు కావడంతో లీగల్‌గా ప్రొసీడ్‌ అయ్యే ఆస్కారం లేదని గుర్తించి అప్పటికప్పుడు టైటిల్‌ మారుస్తున్నట్టు ప్రకటించారు. సెన్సార్‌ క్లియర్‌ చేసిన చిత్రానికి ఇలా ఆటంకాలు తేవడం చట్టరీత్యా నేరం. ఒకవేళ శాంతిభద్రతల సమస్య వుందంటే అప్పుడు థియేటర్ల వద్ద సెక్యూరిటీ పెట్టాలి. గతంలో 'అదుర్స్‌' చిత్రానికి అలాగే బందోబస్త్‌ పెట్టి సినిమా ప్రదర్శించారు.

ఇది ఏ ఒక్కరికో వచ్చిన సమస్యగా చూసి తెలుగు సినిమా తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇక మీదట కూడా ఇలాంటివి పునరావృతం అయ్యే అవకాశాలు లేకపోలేదు. తరచుగా ఎవరో ఒకరు తమ ఉనికి చాటుకోవడం కోసం ఇలాంటి అభ్యంతరాలు లేవనెత్తడం సర్వ సాధారణం. ఒక్కసారి సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన తర్వాత ఇక ఆ చిత్రానికి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం అధికారుల బాధ్యత. పేరు మార్చేసారు కదా అని వదిలేయకుండా దీనిపై తగిన విధంగా పోరాడితే తప్ప భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్‌ అవకుండా ఆపలేరు. 

సినిమా రివ్యూ: బందోబస్త్‌        సినిమా రివ్యూ: వాల్మీకి  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?