తెలుగులోకి గౌతమ్ మీనన్ అసిస్టెంట్

గౌతమ్ మీనన్ తెలుగువారికి సుపరిచితమైన తమిళ దర్శకుడు. ఆయన దగ్గర చాలా కాలం అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన నందిని అనే మహిళా దర్శకురాలు తెలుగులోకి వస్తున్నారు. రైటర్ కోన వెంకట్ సంస్థ కెఎఫ్ సితో…

గౌతమ్ మీనన్ తెలుగువారికి సుపరిచితమైన తమిళ దర్శకుడు. ఆయన దగ్గర చాలా కాలం అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన నందిని అనే మహిళా దర్శకురాలు తెలుగులోకి వస్తున్నారు. రైటర్ కోన వెంకట్ సంస్థ కెఎఫ్ సితో కలిసి, నిర్మాత డివివి దానయ్య నిర్మించే సినిమాకు ఆమె దర్శకత్వం వహించబోతున్నారు. ఇటీవలే ఈ ఇద్దరు కలిసి నినుకోరి సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే.

నందిని చెప్పిన మాంచి కథ విని ఇన్ స్పియర్ అయిన కోన వెంకట్ ఆమెను తెలుగులో దర్శకురాలిగా పరిచయం చేయాలని డిసైడ్ అయిపోయారట. ఇటీవలే ఓ తమిళ మహిళా దర్శకురాలు అన్నపూర్ణ సంస్ణ భ్యానర్ పై రాజ్ తరుణ్ హీరోగా రంగులరాట్నం సినిమాను తెరకెక్కించారు.

ఇప్పటికి తెలుగులో నందినీ రెడ్డి, జయ ఇద్దరు మహిళా దర్శకులు వున్నారు. సౌజన్య అనే మరో మహిళా దర్శకురాలు త్వరలో సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. రాజ్ తరుణ్ నే మరో సినిమాను ఇంకో మహిళా దర్శకురాలి డైరక్షన్ లో చేయబోతున్నారు. 

అంటే ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తయితే, తెలుగులో మహిళా దర్శకురాళ్ల సంఖ్య అరడజను దాటుతుందన్నమాట.