ఓపిక అనేది కొంతకాలమే వుంటుంది. చివరంటా లాగితే ఏదయినా తెగక తప్పదు. రంగస్థలం సినిమా విషయంలో మైత్రీ మూవీస్ నిర్మాతలు ఇలాగే ఫీలవుతున్నారని వార్తలు వినవస్తున్నాయి. జనతాగ్యారేజ్, శ్రీమంతుడు మాదిరిగా స్మూత్ స్టయిలింగ్, ఫాస్ట్ ఫినిషింగ్ కనిపించడం లేదు సుకుమార్ క్యాంప్ లో. ఎంత కాదన్నా వడ్డీలు లెక్క వేసుకుంటే కాస్త ఇబ్బందిగానే వుంటుంది.
దసరాకు రావాల్సిన సినిమా. సంక్రాంతికి తోసారు ఏకంగా. కానీ మళ్లీ మరో లాంగ్ జంప్ వేసి సమ్మర్ కు మార్చినట్లు వార్తలు వినివస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సుకుమార్ తో మైత్రీ నిర్మాతలు భేటీ వేసినట్లు వార్తలు వినవస్తున్నాయి. 'మీరు చెప్పిన కథ బాగుంది. మాంచి సబ్జెక్ట్. అందుకే నిర్మాణంలోకి దిగాము. సినిమా మీద అపనమ్మకం ఏమీ లేదు. కానీ మరీ ఇలా లేటు అవుతూ వుంటే ఏలా' అని మెల్లగా వారు దర్శకుడు సుకుమార్ కు విన్నవించుకునే స్టయిల్ లో చెప్పినట్లు తెలుస్తోంది.
మైత్రీ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఇక్కడే వుంటారు. మరొకరు నవీన్ అమెరికాలో వుంటారు. ఆయన ఇటీవలే ఇక్కడకు వచ్చి వెళ్లారు. అలా వెళ్లే ముందు దర్శకుడు సుకుమార్ తో నిర్మాతలు సిటింగ్ వేసినట్లు తెలిసింది. వీలయినంత త్వరగా సినిమాను ఫినిష్ చేయాలని కోరినట్ల బోగట్టా. అయినా సుకుమార్ తో సినిమా చేద్దాం అనుకునేటపుడే తెలియాలి. ఆయన పెర్ ఫెక్షనిస్టు కనుక, లేటు అవుతుందని, భరించాలని. ఇప్పుడు అనుకుని ఏం లాభం అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.