Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తెలుగులోకి మరో తమిళ డైరక్టర్

తెలుగులోకి మరో తమిళ డైరక్టర్

తమిళ సినిమా ఇప్పుడు తెలుగు వైపు చూస్తోంది. తమిళ డైరక్టర్లు మన హీరోల వైపు, తమిళ హీరోలు మన డైరక్టర్ల వైపు చూస్తున్నారు. 

తమిళ ప్రాజెక్టులు మన నిర్మాతలు నిర్మించాల్సి వస్తోంది. లేటెస్ట్ గా మరో తమిళ డైరక్టర్ తెలుగు సినిమా చేయబోతున్నారు. సింగం సిరీస్ తో తెలుగు వారికి పరిచయం అయిన దర్శకుడు హరి. మాస్ సినిమాల్లో ఆయనది ఓ స్టయిల్. రేసీ స్క్రీన్ ప్లేతో సినిమాను పరుగులు పెట్టిస్తారు.

ఇప్పుడు ఆ డైరక్టర్ తెలుగులో గోపీచంద్ హీరోగా సినిమా చేయబోతున్నారు. ఆ మధ్యన రిపబ్లిక్ సినిమాతో నాలుగు డబ్బులు మిగుల్చుకున్న నిర్మాతలు భగవాన్..పుల్లారావులు ఈ సినిమా నిర్మించబోతున్నారు. 

గోపీచంద్ మాస్ సినిమాలు ఎక్కువగా చేసారు. చేస్తున్నారు. హరి లాంటి డైరక్టర్ కు పక్కా సూటయ్యే హీరో గోపీచంద్.

అందువల్ల గోపీ చంద్ కు ఈ సినిమా బాగానే ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సరైన డైరక్టర్ల కోసం మన హీరోలు ఎదురుచూస్తున్నారు. హరి లాంటి వాళ్లు మన మిడ్ రేంజ్ హీరోలకు బాగా ఉపయోపడతారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?