టెంపర్ హక్కులు గ్రేట్ ఇండియాకు

ఎన్టీఆర్-పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో బండ్ల గణేష్ నిర్మిస్తున్న టెంపర్ సినిమా ఓవర్ సీస్ హక్కులు గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ సంస్థ తీసుకుంది. ఎంతకు తీసుకుందన్న విషయం తెలియచేయకపోయినా, మూడు నుంచి మూడున్నర కోట్ల…

ఎన్టీఆర్-పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో బండ్ల గణేష్ నిర్మిస్తున్న టెంపర్ సినిమా ఓవర్ సీస్ హక్కులు గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ సంస్థ తీసుకుంది. ఎంతకు తీసుకుందన్న విషయం తెలియచేయకపోయినా, మూడు నుంచి మూడున్నర కోట్ల మధ్య డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. 

టెంపర్ హక్కులు తమకు దక్కడం పట్ల జిఐఎప్ సంస్థ ఆనందం వ్యక్తం చేసింది. పూరి కాంబినేషన్ లో పోకిరి, చిరుత చేసామని, ఎన్టీఆర్ కాంబినేషన్ లో స్టూడెంట్ నెం 1, బృందావనం, అదుర్స్,  బాద్ షా చేసామని, అన్నీ పెద్ద హిట్ లే అని, మళ్లీ అదే మ్యాజిక్, అదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని, టెంపర్ పెద్ద హిట్ అవుతుందని  జిఐఎస్ సంస్థ తన ధీమా వ్యక్తం చేస్తోంది. 

తమ సంస్థ రామ్ పండగ చేస్కో,  గోపీచంద్ జిల్, ఓవర్సీస్ హక్కులు, బాహుబలి గుంటూరు, నెల్లూరు హక్కులు తీసుకుందని వివరించారు.