విడుదల తేదీ విషయంలో ఇప్పటికే ఓ మంచి చాన్స్ పోగొట్టుకున్న టెంపర్ సినిమా మళ్లీ అదే తప్పు చేస్తున్నట్లు కనిపిస్తోంది. జనవరి 9న విడుదలై వుంటే సంక్రాంతికి మాంచి మాస్ మసాలా సినిమా లేని లోటు తీరి వుండేది. ఎన్టీఆర్ కు ఓ మాంచి హిట్ దొరికేది. ఇప్పుడు ఫిబ్రవరి 5 లేదా 6 అని నిర్మాత బండ్ల గణేష్ అంటున్నారు.
కానీ అసలు తేదీ వేరే వుందని తెలుస్తోంది ఫిబ్రవరి 13 ఆ అసలు తేదీ. మిగిలిన సినిమాలను కన్ఫ్యూజ్ లో వుంచడానికి ఇలా రెండు తేదీల ఫీలర్లు వదులుతున్నట్లు భావించాలి. అయిదో తేదీ గట్టిగా ఇరవై రోజుల దూరంలో వుంది. ఇంతవరకు అడియో ఫంక్షన్ చేయలేదు. 18న అనుకున్నారు. వాయిదా వేసారు. 25న చేసే అవకాశం వుంది.
ఇదిలా వుంటే 15 నుంచి వరల్డ్ కప్ క్రికెట్ ప్రారంభమవుతోంది. ఎంత కాదన్నా దాని ఎఫెక్ట్ కొంత వుంటుంది. అలాగే ఫిబ్రవరి రెండో వారం అంటే పరిక్షల సీజన్ ప్రారంభమైపోతుంది. నిజానికి నిర్మాత బండ్లకు 5, 6 తేదీల్లో సినిమాను వదిలేయాలని వుంది. కానీ అతని చేతిలో ఏమీ లేదు. పూరి-ఎన్టీఆర్ ఎలా అంటే అలా..ఎలా అనుకుంటే అలా. దానికి తలఊపి, తన నిర్ణయంగా చెప్పుకోవడం తప్ప బండ్ల చేసేది ఏమీ లేదు. ఎన్టీఆర్ లక్ ఎలా వుందో మరి ?