ఈ మాట టాలీవుడ్ లో వినిపిస్తోంది. వకీల్ సాబ్ సినిమాకు అన్నీ తానే, అంతా తానే అన్నంత హడావుడి చేస్తున్నాడు థమన్ అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
అలవైకుంఠపురములో సినిమాకు మ్యూజిక్ ఫెస్టివల్ చేయాలన్న ఐడియా దర్శకుడు త్రివిక్రమ్ ది. దాన్ని ఓ రేంజ్ లో చేసారు. అందుకోసం బోలెడు ఖర్చు చేసారు. ఇప్పుడు అదే ఐడియాను థమన్ వకీల్ సాబ్ కోసం అమలు చేసాడు. అయితే జస్ట్ ఓ మిడ్ రేంజ్ హీరోకి చేసినట్లు సింపుల్ గా ఓ కాలేజీలో కానిచ్చేసారు.
వకీల్ సాబ్ సినిమాకు సమస్య ఏమిటంటే పవన్ కళ్యాణ్ మహా అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కే వస్తారు. సినిమాలో వున్న నటులు అంతా అంత పుల్లింగ్ కెపాసిటీ వున్నవారు కాదు. అందువల్ల వారితో పబ్లిసిటీ ప్లానింగ్ వర్కవుట్ కాదు.
ఇక మిగిలింది థమన్ నే. అందుకే అతన్నే వాడేస్తున్నారు. పైగా థమన్ కు కూడా ఈ పబ్లిసిటీ నే కావాలి. నిజానికి వకీల్ సాబ్ సినిమాకు ఏ ప్రచారం అక్కరలేదు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ సినిమా అన్న పాయింట్ చాలు.
మెగా హీరోలు అంతా వచ్చే ప్రీరిలీజ్ ఫంక్షన్ చాలు. కానీ లైవ్ లో ఏదో ఒక హడావుడి జరుగుతూ వుండాలి కదా అని ఏదో ఒకటి చేస్తున్నట్లు కనిపిస్తోంది. దాన్ని థమన్ పట్టుకుని తెగ హడావుడి చేస్తున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.