కొంత మంది నిర్మాతల దగ్గర దర్శకులు కోత్తయినా, పాత అయినా హ్యాపీనే కానీ కొంత మంది నిర్మాత దగ్గర దర్శకుడు కొత్త అయినా పాత అయినా కష్టమే. కాళ్లు, చేతులు పెట్టి మరీ కెలికేస్తారు.
ఆ మధ్య వచ్చిన ఓ సినిమా విషయంలో ఇలాగే జరిగిందని తెలుస్తోంది. సినిమాకు డైరక్టర్ కొత్త. పైగా నిర్మాతలకు డైరక్షన్ మీద విపరీతమైన ఆసక్తి. దాంతో భయంకరంగా బ్యాక్ సీట్ డ్రయివింగ్ చేసేసారట.
ప్రతి షాట్ డైరక్టర్ తీయడం. కానీ తరువాత మోనిటర్ లో అది చూసి నిర్మాతలు అలా కాదు ఇలా, ఇలా కాదు అలా అని డైరక్టర్ కు చెప్పడం, దాంతో అతగాడు మళ్లీ రీ టేక్ చేయడం. తరచు ఇలా అయ్యేసరికి సెట్ మీద ఓ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈ విషయంలో కాస్త బరస్ట్ అయ్యాడట.
'బాబూ..ముందే నిర్మాతలను అడిగి వచ్చేయ్..ఎలా చేయాలి? మాడ్యులేషన్ ఎలా వుండాలి? అన్నీ, ఆ విధంగా చేసేస్తాం..అంతే కానీ నువ్వు ఒకలా చెప్పి, మళ్లీ వాళ్లు వేరే విధంగా చెప్పి, టైమ్ వేస్ట్ అని క్లాస్ పీకేసాడట.
నిర్మాతలు అక్కడితో ఆగకుండా డబ్బింగ్ రూమ్ లో కూడా ఎంటరై, మాడ్యులేషన్ ఎలా వుండాలి. డైలాగ్ ఎలా చెప్పాలి అన్నవి కూడా చెప్పుకువచ్చారని తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఏమయింది సినిమా తేడా అయింది. పాపం, ఆ కొత్త డైరక్టర్ ఎవరు మళ్లీ సినిమా ఇస్తారా? అని చూస్తున్నాడు.