థాంక్యూ సినిమాకు బ్రేక్

కరోనా కారణంగా దాదాపు సినిమాల షూటింగ్ లు అన్నీ నిలిచిపోయాయి. కేవలం రెండు మూడు సినిమాల షూటింగ్ లు మాత్రం జరుగుతున్నాయి. దిల్ రాజు నిర్మించే థాంక్యూ సినిమా వాటిలో ఒకటి.  Advertisement నాగ్…

కరోనా కారణంగా దాదాపు సినిమాల షూటింగ్ లు అన్నీ నిలిచిపోయాయి. కేవలం రెండు మూడు సినిమాల షూటింగ్ లు మాత్రం జరుగుతున్నాయి. దిల్ రాజు నిర్మించే థాంక్యూ సినిమా వాటిలో ఒకటి. 

నాగ్ చైతన్య – విక్రమ్ కుమార్ కాంబినేషన్ థాంక్యూ షూటింగ్ ఇటలీ లో జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ షూటింగ్ కూడా ఆగిపోయింది.

ఇటలీ షెడ్యూలుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ హాజరుకావాల్సి వుంది. కానీ ఆయన బయల్దేరడం ఒక రోజు ఆలస్యమైంది. ఈ లోగా ఇటలీ కి భారతీయుల ప్రయాణాల పై ఆంక్షలు విధించారు. దాంతో షూటింగ్ నిలిచిపోయినట్లు తెలస్తోంది. 

పుష్ప సినిమా షూటింగ్ కొన్ని రోజులు చేసారు. సునీల్ సీన్లు చాలా వరకు తీసారు. కానీ దానికి కూడా బ్రేక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

గీతా సంస్థలో బన్నీవాసుతో సహా చాలా మందికి కరోనా రావడం తగ్గడం జరిగింది. దాంతో ఆ సంస్థ కూడా షూటింగ్ లు నిలిపివేసింది.