తనూశ్రీదత్తా.. తెలుగులో బాలకృష్ణ సరసన 'వీరభద్ర' సినిమాలో నటించింది. అందాల పోటీలు, మోడలింగ్ నుంచి సినిమాల్లోకొచ్చిన ఈ భామ, పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా వుంటోన్న తనూశ్రీ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ద్వారా మళ్ళీ లైమ్‌లైట్‌లోకి వచ్చిన సంగతి తెల్సిందే. నానా పటేకర్ తక్కువేం తిన్లేదు.. తనపై తనూశ్రీ దత్తా ఆరోపణల నేపథ్యంలో ఆమెకు లీగల్ నోటీసులు పంపాడు.
అయితే, 'నాకు ఆ నోటీసులు అందలేదు.. నోటీసులు వచ్చినా భయపడేది లేదు..' అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియో అది.,నానా పటేకర్, తనూశ్రీదత్తా సెట్స్‌లో వుండగా తీసిన వీడియో అది. తనూశ్రీ దత్తా డాన్స్ చేస్తుండడం, ఆ సమయంలో నానా పటేకర్ ఆమెను అదోరకంగా చూస్తుండడం ఆ వీడియోలో కన్పించింది.
ఇక, తాజాగా నానా పటేకర్తోపాటుగా, ఫిలింమేకర్ వివేక్ అగ్నిహోత్రి కూడా తనూశ్రీ దత్తాకి లీగల్ నోటీసులు పంపాడు. ఈ నేపథ్యంలో తనూశ్రీ దత్తా అలర్ట్ అయ్యింది. నోటీసులు అందుకున్న తనూశ్రీ దత్తా, మీడియాకి ఓ వీడియోని లీక్ చేసే ప్రయత్నాల్లో వుందట. ఆ వీడియోలో, తనతో నానా పటేకర్ అసభ్యకరంగా ప్రవర్తించిన దృశ్యాలు వున్నాయంటూ తనూశ్రీ దత్తా సన్నిహితులు చెబుతున్నారు.
'ఇవేమీ సృష్టించినవి కావు.. మేకింగ్ వీడియోల్లోనే నానా పటేకర్ బాగోతమంతా రికార్డ్ అయ్యింది. అయితే అప్పట్లో అతనికి వున్న స్టార్డమ్ నేపథ్యంలో ఎవరి వద్దకు వెళ్ళి వాటిని సాక్షాలుగా చూపించినా పట్టించుకోలేదు.. అప్పటితో పోల్చితే ఇప్పుడు తనూశ్రీ దత్తా మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా వుంది.
ఈ సమస్యను ఇక్కడితో వదిలే ప్రసక్తే లేదు..' అంటూ తనూశ్రీ దత్తా సన్నిహితులు తెగేసి చెబుతుండడం గమనార్హం. ఇంతకీ, తనూశ్రీ దత్తా దగ్గర వున్న ఆనాటి ఆ 'ప్రత్యేకమైన' వీడియోల్లో ఏముందట.? ఏమో వేచి చూడాల్సిందే.
ఇదిలా వుంటే, నానా పటేకర్ బాధితులతో తనూశ్రీ దత్తా మాట్లాడుతోందనీ.. మరిన్ని ఆధారాలు సేకరించిందనీ, వాటిల్లో కొన్ని అసభ్యకరమైన వీడియోలున్నాయనీ బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.