కరోనా వైరస్ మేఘాలు హైదరాబాద్ మీద కూడా కమ్ముకుంటున్నాయి. హైదరాబాద్ లో కూడా థియేటర్లు, మాల్స్ బంద్ ప్రకటించే అవకాశం వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్ల విషయంలో ఎగ్జిబిటర్ల చాంబర్ నే స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకునే అవకాశం వున్నట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
ప్రస్తుతం సినిమాల విడుదల సరిగ్గా లేదు. ముందుగా అనుకున్న సినిమాలు కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 25న రావాల్సిన వి సినిమాను వాయిదా వేసారు. అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ మేరకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వచ్చేవారం చివరి వరకు పరిస్థితి చూసి నిర్ణయం తీసుకోవాలని వచ్చే నెల 2న విడుదలయ్యే సినిమాల నిర్మాతలు వేచి వున్నారు.
మరోపక్కన కరోనా భయంతో థియేటర్లకు జనం రావడం కూడా తగ్గింది. ఇలాంటి నేపథ్యంలో థియేటర్ల నిర్వహణ కూడా భారంగా మారుతుంది. అందువల్ల అన్ని విధాలా కలిసి వచ్చేలా ఒక పది రోజుల పాటు లేదా వారం పాటు థియేటర్లను బంద్ చేసే ఆలోచనను సినిమా ఇండస్ట్రీ పెద్దలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషక్షంలో శనివారం క్లారిటీ రావచ్చు.