Advertisement

Advertisement


Home > Politics - Gossip

బాబు సొంత జిల్లాలో ఇదేం దుస్థితి!

బాబు సొంత జిల్లాలో ఇదేం దుస్థితి!

స్థానిక సంస్థల బరిలో పలుచోట్ల ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఏకగ్రీవం అయిన దేనినీ... ఏకగ్రీవంగా విశ్వసించగల పరిస్థితి లేకుండా పోయింది. ఏవి నిజంగా ఏకగ్రీవాలో.. ఏవి భయగ్రీవాలో ఇదమిత్థంగా తేల్చి చెప్పలేం. దాడులు, బెదిరింపులు, ప్రలోభాల మధ్య చాలా చోట్ల ఎన్నికలు ఏకగ్రీవం అవుతున్నాయి. ప్రపంచంలో ఏ ఏకగ్రీవం వెనుక అయినా.. ఇలాంటిది ఏదో ఒకటి చివరికి రాజీ సంప్రదింపులు అనే ముసుగులో అయినా.. తప్పకుండా ఉంటుంది.

ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఏకగ్రీవ ఎన్నిక కూడా బెదిరింపుల కేటగిరీలోకే వచ్చేస్తోంది. ప్రలోభాలు పెడుతున్నారంటూ విపక్షాలు యాగీ చేస్తున్నారు. నిజమే కావొచ్చు.. రాజకీయం అనేది యుద్ధరంగంగా మారిపోయిన తర్వాత... కనీసం బెదిరింపు కూడా లేకుండా ఎలా ఉంటుంది. రాజకీయ లాలూచీ వ్యవహారం అయిపోయాక ప్రలోభాలు లేకుండా ఎలా ఉంటాయి. అవే ప్రస్తుతం జరుగుతున్నాయి.

కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... ప్రలోభాలకు గానీ బెదిరింపులకు గానీ లొంగడం అంటే ఇవతలి వాళ్లలో కూడా కొంత బలహీనత  ఉండాలి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24 జడ్పీటీసీ స్థానాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. తమాషా ఏటంటే ఆ మొత్తం 24లో అత్యధికం.. 9 జడ్పీటీసీ స్థానాలు చిత్తూరు జిల్లాలోనే. అలాగే ఎంపీటీసీలు కూడా.. అత్యధికంగా 170 స్థానాలు ఈ జిల్లాలో ఏకగ్రీవం అవుతున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన సంగతేంటంటే... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో ఆయన పార్టీ నాయకులు ప్రలోభాలకు గానీ, బెదిరింపులకు గానీ లొంగిపోయే దుస్థితిలో ఉణ్నారా? అన్నది. తన సొంత జిల్లాలో కూడా ఏ మాత్రం పార్టీ మీద పట్టు నిలుపుకోలేని విధంగా చంద్రబాబు ఉన్నారా అన్నది. సొంత జిల్లాగనుక.. ఈ ఏకగ్రీవాలు చంద్రబాబుకు అప్రతిష్టే అవుతాయి.

స్క్రిప్టులో వేలు పెట్టట్లేదు..

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?