‘పెద్ద జోక్.. నేను ఫీల్ అవ్వడం ఏంట్రా బాబూ’

సినిమా సక్సెస్ అయితే అందరూ హ్యాపీ. ఫెయిలైతే మాత్రం ఒక్కో హీరో ఒక్కో విధంగా రెస్పాండ్ అవుతాడు. వారం రోజుల పాటు గది నుంచి బయటకురాని హీరో ఒకడు. రాత్రంతా తాగి, ఫ్లాప్ ను…

సినిమా సక్సెస్ అయితే అందరూ హ్యాపీ. ఫెయిలైతే మాత్రం ఒక్కో హీరో ఒక్కో విధంగా రెస్పాండ్ అవుతాడు. వారం రోజుల పాటు గది నుంచి బయటకురాని హీరో ఒకడు. రాత్రంతా తాగి, ఫ్లాప్ ను మరిచిపోయి, మర్నాడు పొద్దున్నకి ఫ్రెష్ అయ్యేవాడు ఇంకొకడు. విదేశాలకు వెళ్లి 'ఓదార్పు' కోరుకునే హీరో మరొకడు. ఇలా ఒక్కో హీరో ఒక్కో రకంగా తమ ఫ్లాపుల నుంచి బయటకొస్తుంటారు.

టాలీవుడ్ లో ఓ సీనియర్ హీరో ఉన్నాడు. అతడు మాత్రం చాలా తేడా. అతడు చేసిన కొన్ని సినిమాల్లో క్యారెక్టరైజేషన్లు ఎంత తేడాగా ఉంటాయో.. నిజజీవితంలో కూడా అతగాడు అంతే తేడా. సినిమా హిట్టయితే సంబరపడతాడేమో కానీ, ఫ్లాప్ అయితే మాత్రం అస్సలు కంగారు పడడు. పైపెచ్చు తన ఫ్లాప్ ను సెలబ్రేట్ చేసుకునే రకం ఈ హీరో.

తాజాగా ఈ హీరో నటించిన ఓ సినిమా ఫ్లాప్ అయింది. నిజానికి ఇతగాడికి ఫ్లాపులు కొత్తకాదు. ఎన్నో ఫ్లాపుల్లో ఇది కూడా ఒకటి. కాకపోతే ఓ సెక్షన్ మీడియా మాత్రం, తాజా ఫ్లాప్ తో సదరు హీరో హర్ట్ అయినట్టు వార్తలు వండివార్చింది. దీనికి విరుద్ధంగా ఈ హీరో, ఇంతకుముందే చెప్పుకున్నట్టు కొంతమందిని పిలిచి రాత్రి పార్టీ ఇచ్చాడు. ఫ్లాప్ తో తనకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించాడు.

అయితే పార్టీలో మాత్రం ఈ టాపిక్ చర్చకొచ్చింది. అతడి గురించి తెలిసినోళ్లు లైట్ తీసుకున్నారు. కొంతమంది మాత్రం ఫ్లాప్ అంశం ప్రస్తావనకు తెచ్చారు. దీన్ని సదరు సీనియర్ హీరో పిచ్చ లైట్ తీసుకున్నాడు. “నేను ఫీల్ అవ్వడం ఏంట్రా బాబు, పెద్ద జోక్ ఇది. పని చేసుకుంటూ పోవడమే, ఏదీ మన చేతిలో లేదు, జరగాల్సింది జరుగుతుంది” అంటూ గ్లాస్ అందుకున్నాడు.

నిజంగా ఈ మైండ్ సెట్ కలిగి ఉండడం చాలా అరుదు. ఇలాంటి యాటిట్యూట్ ను అలవర్చుకోవడం చాలా కష్టం. అందుకే ఈ వయసులో కూడా అతడు యంగ్ గా కనిపిస్తాడు. ఎనర్జీకి మారుపేరుగా నిలుస్తున్నాడు.