పరివర్తన పాఠాలు ఎవరు ఎవరికి చెప్పాలి….?

రాజకీయాల్లో ప్రజలే ఎపుడు ప్రభువులు. వారే మాస్టర్లు, హెడ్ మాస్టర్లు. వారు పాఠం చెప్పినా తీర్పు చెప్పినా నాయకులకు అదే గుణ పాఠంగా ఉంటుంది. అలా జరగాలనే తీర్పు ఇస్తారు. 2019లో ఘోరంగా ఓడిన…

రాజకీయాల్లో ప్రజలే ఎపుడు ప్రభువులు. వారే మాస్టర్లు, హెడ్ మాస్టర్లు. వారు పాఠం చెప్పినా తీర్పు చెప్పినా నాయకులకు అదే గుణ పాఠంగా ఉంటుంది. అలా జరగాలనే తీర్పు ఇస్తారు. 2019లో ఘోరంగా ఓడిన తెలుగుదేశం పార్టీ నేర్చుకున్న పాఠాలు ఏమిటో తెలియదు. 2024లో తమకు అధికారం ప్రజలు ఇస్తారని ఆ పార్టీ నమ్ముతోంది.

ఏపీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం గెలిస్తే చేసే మొట్టమొదటి పని ఏంటో చెప్పారు. కొత్తగా స్కూల్ ఒకటి పెట్టి జగన్ సహా వైసీపీ నేతలు అందరికీ పరివర్తన పాఠాలు చెబుతారట. ఏపీలో నియంత పాలన సాగుతోందని, అందుకే దాడులు కూల్చివేతలు అని అచ్చెన్న అంటున్నారు.

గీతం మీద వైసీపీ ప్రభుత్వం పగబట్టిందని అచ్చెన్న అంటున్నారు. బంగారం లాంటి గీతం అని వాపోతున్నారు. విశాఖ గీతం డీమ్డ్ యూనివర్శిటీ ప్రభుత్వ స్థలం ఆక్రమించుకుంటే స్వాధీనం రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
 
గీతం విద్యా సంస్థ మీద ఎవరూ దాడి చేయలేదని అచ్చెన్న మరచారు అంటున్నారు. గీతం అనే సంస్థ ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే తీసుకోవాలా వద్దా అన్నది అచ్చెన్న చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు వీటికి మించి అచ్చెన్న మాట్లాడేది ఏమిటి అంటే వైసీపీ నేతలకు పరివర్తన పాఠాలు చెబుతామని అనడం.

ప్రజలు అందరికీ పరివర్తన పాఠాలు చెబుతారని, వారి దగ్గర మార్కులు రాకనే 2019 ఎన్నికల్లో ఫెయిల్ అయ్యామని అచ్చెన్న వంటి వారు గ్రహిస్తే మంచిదని అంటున్నారు. వైసీపీది నియంత నికృష్ట పాలన అంటూ దూషిస్తున్న అచ్చెన్న టీడీపీ పాలనలో ఉద్ధరించింది ఏమీ లేదు కాబట్టే జనాలు ఓడించారు అని గుర్తిస్తే మంచిదని వైసీపీ నేతలు అటాక్ చేస్తున్నారు.