కల్యాణ్ గారు ఇది బాహుబలి కాదు!

ప్రస్తుతం బాలకృష్ణతో జై సింహా అనే సినిమా నిర్మిస్తున్నాడు సి.కల్యాణ్. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 70శాతం కంప్లీట్ అయింది. సంక్రాంతి రిలీజ్ కు…

ప్రస్తుతం బాలకృష్ణతో జై సింహా అనే సినిమా నిర్మిస్తున్నాడు సి.కల్యాణ్. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 70శాతం కంప్లీట్ అయింది. సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు చుక్కలు చూపిస్తున్నాడట కల్యాణ్. ఊహించని రేట్లు చెప్పి బెంబేలెత్తిస్తున్నాడు.

బాలయ్య మార్కెట్ ఏంటో అందరికీ తెలుసు. అతడి సినిమాలు ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తాయో కూడా తెలుసు. కానీ సి.కల్యాణ్ మాత్రం వాటిని పట్టించుకోకుండా రేట్లు ఫిక్స్ చేశాడట. ఓవర్సీస్ తో పాటు ఒకట్రెండ్ ఏరియాలు మినహాయించి మిగతా అన్ని ఏరియాల రైట్స్ ను దాదాపు 40శాతం పెంచేశాడట. దీంతో చాలా ఏరియాల్లో మార్కెట్ ఇంకా ఓపెన్ గానే ఉంది. 

బాలయ్య సినిమాలు ఆడితే కలెక్షన్లు బాగానే వస్తాయి. ఫ్లాప్ అయితే మాత్రం మినిమం వసూళ్లు కూడా రావు. అందుకే కల్యాణ్ చెప్పినంత ఇవ్వడానికి బయ్యర్లు వెనకాడుతున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర, వెస్ట్ లాంటి ఏరియాల్లో తనే సినిమాను సొంతగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు సి.కల్యాణ్. మిగతా ఏరియాల విషయంలో మాత్రం భారీ రేట్లు చెబుతున్నాడు. 

అందుకే మార్కెట్ సర్కిల్ లో జై సింహాపై జోక్స్ పేలుతున్నాయి. బాలయ్య సినిమాకు బాహుబలి రేట్లు చెబుతున్నారంటూ సరదా కామెంట్స్ వినిస్తున్నాయి.