ఒకప్పుడు పెద్ద హడావుడి చేసిన టైటిల్ స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్. మెగాస్టార్ మాంచి ఊపు మీద వున్న రోజుల్లో వచ్చిన యండమూరి వీరేంద్రనాధ్ నవల..డైరక్షన్ సినిమా. సరే, రిజల్ట్ ఏమిటి అన్నది పక్కన పెడితే ఒకటి రెండేళ్లుగా వినిపిస్తోంది. టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా. స్టూవర్ట్ పురం టైగర్ నాగేశ్వరరావు బయోపిక్. ఈ సినిమా హీరోల చేతులు మారింది. బ్యానర్ చేతులు మారింది.
ముందుగా ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ తో అనుకుంది. చాలా కాలం నలిగింది. కానీ ఎందుకో మెటీరియలైజ్ కాలేదు. తరువాత ఆ ప్రాజెక్టు పీపుల్స్ మీడియా..అభిషేక్ అగర్వాల్ దగ్గరకు వెళ్లింది. రవితేజతో ఫిక్స్ అనుకున్నారు్. అదే వార్తలు వున్నాయి కొన్ని రోజుల క్రితం వరకు.
ఇప్పుడు సడెన్ గా స్టూవర్ట్ పురం దొంగ అనే కొత్త టైటిల్, టైగర్ బయోపిక్ అనే కొత్త ట్యాగ్ లైన్ తో సినిమా ప్రకటన వచ్చింది. అల్లుడు శ్రీను తరువాత సినిమాలు ఆపేసిన నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మాతగా, ఆయన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అనౌన్స్ చేసేసారు. గమత్తేమిటంటే ఈ కథ ను తయరుచేయడంలో కీలకమైన శ్రీకాంత్ విస్సా పేరు ఇక్కడ మిస్ అయిందని తెలుస్తోంది.
అంటే టైగర్ నాగేశ్వరరావే స్టూవర్ట్ పురం దొంగగా మారాడా? లేక ఆ ప్రాజెక్టు అదే..ఇది ఇదేనా? కొంచెం క్లారిటీ రావాల్సి వుంది. ఇదంతా టైగర్ నాగేశ్వరరావు ప్రాజెక్టులోకి బెల్లంకొండ శ్రీనివాస్ ను పంపడానికి బెల్లంకొండ సురేష్ వేసిన ఎత్తుగడ అని గుసగుసలు వినిపించడం మరీ చిత్రంగా వుంది.