టాలీవుడ్ పెద్దలు కొందరి నడుమ కొత్త వ్యూహానికి, సరికొత్త చర్చలకు తెరలేచింది. చంద్రబాబు నాయుడు చకచకా ఆంధ్ర వ్వవహారాలను చక్కబెడుతుండడంతో, టాలీవుడ్ జనాల దృష్టి అటు మళ్లింది. దేశ, విదేశీ పరిశ్రమలు అన్నీ ఆంధ్రకు తెస్తున్న చంద్రబాబు, ఇప్పుడు సినిమా పరిశ్రమను కూడా రమ్మని కబురు పంపినట్లు సమాచారం. సినిమా రంగానికి చెందిన ఓ కీలక నిర్మాత కమ్ స్టూడియో ఓనర్ ద్వారా ఈ సమాచారం కొందరికి అందింది. అమరావతికే సినిమా పరిశ్రమను కూడా మళ్లించాలని బాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అమరావతికి సినిమా పరిశ్రమను తీసుకెళ్లడం వెనుక చాలా వెసులు బాటు వుంటుంది. ఒకటి స్థలం. సినిమా పరిశ్రమకు కనీసం కొన్ని వేల ఎకరాలు కేటాయించాల్సి వుంటుంది. విశాఖలో అంత స్థలం కష్టం. అదే విధంగా సినిమా పరిశ్రమ అమరావతికి వస్తే, ఫ్లోటింగ్ పాపులేషన్, ఉపాథి బాగా పెరుగుతుంది. అదే విధంగా స్టూడియోలు వుంటే పర్యాటకం కూడా బాగుంటుంది. ఇలా అన్ని విధాలా అనువైనది కనుక, హైదరాబాద్ కు సమాంతరంగా అమరావతిలో కూడా సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని బాబు సంకల్పించనట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పుడు ప్రారంభ దశలోనే ఎవరు? ఏమిటి? ఎలా? అసలు ఆసక్తి ఏ మేరకు అన్నది తెలుసుకోవాలని బాబు అనుకుంటున్నారు. ఈ మేరకు ఎక్కడి సమాచారం అక్కడకు వెళ్లింది. దాంతో ఇండస్ట్రీ పెద్దలు సమాలోచనలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అసలు ఇండస్ట్రీ రెండుగా అయితే ఏమేరకు లాభం? ఏ మేరకు నష్టం? అసలు బాబు కోసం అక్కడకు వెళ్తారు సరే, కానీ దాని వల్ల ఆయనకు పేరు, ప్రయోజనం సరే, వీరికి ప్రయోజనం ఏ మేరకు? ఎందుకుంటే ఇప్పటికిప్పుడు బిజినెస్ అక్కడ పూర్తిగా లభించదు.
పైగా కొత్తగా ఇన్ ఫా స్ట్రక్చర్ అంటే భారీ పెట్టుబడులు అవసరం. మరి రికవరీ ఎలా వుంటుంది? దీనికి ప్రభుత్వం నుంచి ఏ మేరకు సహకారం వుంటుంది? కేవలం భూమి ఇవ్వడమేనా? రాయతీలు ఏమన్నా ఇస్తారా? ఇవన్నీ ఇంకా తెలియవు. అందుకే అసలు సినిమా పెద్దల అవసరాలు, అభిప్రాయాలు ఏమిటి? అన్నది ఓ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేస్తే, దానిపై చంద్రబాబు రియాక్షన్ తెలుసుకోవచ్చు. దానిపైనే ఇప్పుడు సినిమా పెద్దలు కొందరు కిందా మీదా పడుతూ బిజీగా వున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటికే హైదరాబాద్ లో అన్ని విధాలా పెట్టుబడులు పెట్టిన వారి కంటే, మిగిలిన వారే ఈ దిశగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అయితే హైదరాబాద్ లో స్టూడియోతో పాటు ఆంధ్రలో కూడా వున్న ఓ నిర్మాత ఈ వ్యవహారాల వెనుక కీలకంగా వున్నారని తెలుస్తోంది. అమరావతి రూపకల్పన డిజైన్ పూర్తి కావస్తున్నందున చంద్రబాబు తొందర పడుతున్నారు. అందుకే సినిమా పెద్దలు కూడా హడావుడి పడుతున్నట్లు వినికిడి.
రామోజీకి ఓకేనా?
మరి సినిమా పరిశ్రమను అమరావతికి తరలిస్తే, నిర్మాత, మీడియో కింగ్ పిన్, స్టూడియో అధినేత రామోజీకి ఓకెనా? ఆయనకు తెలియకుండా, ఆయన సమ్మతి లేకుండా బాబు ఇలాంటి వ్వవహారానికి తెరతీస్తారా? అంటే దీనివల్ల రామోజీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన స్టూడియో అటు బాలీవుడ్, ఇటు తమిళ సినమాలను కూడా బాగా పికప్ చేసింది.
పైగా ఆయన దాన్ని స్టూడియో కన్నా పర్యాటక కేంద్రంగా ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నారు. ఓం సిటీ అంటూ ఆధ్యాత్మిక నగరాన్ని నిర్మించి తరతరాలకు తరగని వ్యాపారాన్ని తలపెట్టారు. అందువల్ల ఈ చిన్న చిన్న సినిమాలు, షూటింగ్ లు ఆయనకు పీ నట్స్ తోసమానం. పైగా కావాలంటే అక్కడ మరోటి కట్టమన్నా కడతారు.
ఇవన్నీ ఆలోచించిన మీదటే చంద్రబాబు ఈ స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది.అందువల్లనే సినిమా పెద్దలు మిగిలిన పనులు పక్కన పెట్టి ఈ వ్యవహారంపైనే దృష్టి సారించారని వినికిడి.