సూర్య సినిమాలో అజయ్

అజయ్ మంచి నటుడు. తెలుగునాట వైవిధ్యమైన సినిమాలు చేసాడు..చేస్తున్నాడు. ఇప్పుడు అజయ్ ప్రతిభ పక్క భాషకు కూడా పాకింది. తమిళనాట ఓ పెద్ద సినిమాకు అజయ్ ను ఓ కీలకపాత్రకు తీసుకున్నారు.  Advertisement తమిళ…

అజయ్ మంచి నటుడు. తెలుగునాట వైవిధ్యమైన సినిమాలు చేసాడు..చేస్తున్నాడు. ఇప్పుడు అజయ్ ప్రతిభ పక్క భాషకు కూడా పాకింది. తమిళనాట ఓ పెద్ద సినిమాకు అజయ్ ను ఓ కీలకపాత్రకు తీసుకున్నారు. 

తమిళ సూపర్ స్టార్ సూర్య తాను హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్నాడో సినిమాను. మనం, ఇష్క్ లాంటి సూపర్ డూపర్ సినిమాలు తీసిన విక్రమ్ కుమార్ దీనికి దర్శకుడు. సమంత కథానాయిక. ఇష్క్ లో అజయ్ ప్రతిభ చూసిన విక్రమ్ తన తమిళ సినిమాకు కూడా అతడిని తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబాయ్ లో జరుగుతోంది. 

ఈ సినిమాకు 24 అని పేరు పెట్టారు. విక్రమ్ కుమార్ సినిమాలే కాదు, టైటిళ్లు కూడా వైవిధ్యంగానే వుంటాయి. ఆయన ఓ సినిమాకు 13బి అని పేరు పెట్టాడు. దీనికి మళ్లీ అలాగే నెంబర్ మీదే పేరు పెట్టాడు.